WhatsApp New Features : ఫాస్ట్ మెసేజ్‌లకు వాట్సాప్(WhatsApp) అతి పెద్ద మాధ్యమంగా మారింది. వాట్సాప్ కేవలం మెసేజ్(Messages) లకు మాత్రమే కాకుండా వాయిస్ కాలింగ్(Voice Calling), వీడియో కాలింగ్(Video Calling) కు అతి పెద్ద మాధ్యమం. దీనిని సుమారు 2 బిలియన్లకు పైగా ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటుంది.
తన వినియోగదారుల వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్(New Feature) ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వస్తుంది కంపెనీ. వాట్సాప్ ఇప్పుడు ప్రొఫైల్ ఫొటో(Profile Photo) కు సంబంధించి పెద్ద అప్ డేట్ ను తీసుకుని వచ్చింది. ఎవరైనా మీ ప్రొఫైల్ ఫొటోను సేవ్ చేసుకున్నారనే ఆందోళన చెందుతుంటే ఇక నుంచి ఆ టెన్షన్ ఉండదు అంటుంది కంపెనీ.
ఇప్పటి వరకు ఎవరైనా ప్రొఫైల్ ఫొటో పెట్టుకుంటే దానిని అవతలి వారు స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకునే వారు. కానీ ఇక నుంచి అలా జరగదు అంటుంది కంపెనీ. ఇక నుంచి ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్ షాట్ తీసే ఫీచర్ ను బ్లాక్ చేసే విధంగా కొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
యాప్ తాజా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, వినియోగదారులు ఇతర వినియోగదారుల ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్‌షాట్‌లను తీసుకోలేరు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్ లో ఉంది. ప్రస్తుతం కంపెనీ దీనిని బీటా వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేసింది. ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవాలంటే వాట్సాప్ బీటా వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
Also Read : క్రెడిట్ కార్డుతో ఈ 5 రకాల ప్రయోజనాలు.. డబ్బు కూడా ఆదా! ఎలాగంటే?