Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు!

తెలియని ఖాతాల నుంచి రుణాలు, ఉద్యోగాలు అంటూ వచ్చే స్కామ్‌, స్పామ్‌ మెసేజ్‌ల నుంచి విముక్తి పొందేందుకు వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ ని ప్రవేశ పెట్టనుంది.ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, తెలియని కొత్త ఖాతాల నుండి సందేశాలు వచ్చినపుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది.

Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు!
New Update

Whatsapp Feature: మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా...అయితే ఈ అవకాశం మీకోసమే... ఈరోజే మీరు 5 లక్షల రూపాయల రుణం పొందడానికి అర్హత సాధించారు. ఒక్క క్లిక్ చేయండి చాలు...ఇలాంటి మెసేజులతో విసిగిపోతున్నారా? ఇలాంటి మెసేజులతో విసిగిపోయారా..? అయితే ఇక నుంచి ఇలాంటి మెసేజులకు ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్త యాప్‌ ని కనిపెట్టింది.

ఏది స్కామ్‌, ఏది స్పామ్‌? దేనిని నమ్మాలో.. నమ్మకూడదో తెలియక మోసపోతున్న సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సెక్యూరిటీ ఫీచర్ వినియోగదారులకు అవాంఛిత సందేశాల అయోమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, తెలియని కొత్త ఖాతాల నుండి సందేశాలు వచ్చినపుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

దీనిని ఎలా ఎనెబుల్‌ చేసుకోవాలంటే... మొదట వాట్సప్ ఓపెన్ చేసి.. కుడి వైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
ఆ తరువాత సెట్టింగ్‌ ఆప్షన్ ఎంచుకొని.. ప్రైవసీ విభాగంపై క్లిక్ చేయాలి.ఇప్పుడు కిందకు స్క్రోల్ చేస్తే.. అడ్వాన్స్‌డ్అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిని క్లిక్ చేయండి.ఇక్కడ ప్రొటెక్ట్ ఐపీ అడ్రెస్ ఫ్రమ్ కాల్స్ కనిపిస్తుంది.. దానిని ఎనేబుల్ చేసుకోవాలి.

#whatsapp #new-feature
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe