liquor scam: లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ సభ్యులు ఎందుకు అప్రూవర్స్‌గా మారుతున్నారు..? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజా పరిణామాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. 2021-2022 ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిపి పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీకి రూ.100 కోట్ల ఆర్ధిక సహాయం చేశారనే అరోపణలతో అరెస్ఠుల పర్వం కొనసాగింది. సీబీఐ, ఈడీ నిందుతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సౌత్ గ్రూపులో కీలకంగా మారిన వారంతా ఒక్కొక్కరు అప్రూవర్స్‌గా మారుతున్నారు. By BalaMurali Krishna 13 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజా పరిణామాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. 2021-2022 ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిపి పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీకి రూ.100 కోట్ల ఆర్ధిక సహాయం చేశారనే అరోపణలతో అరెస్ఠుల పర్వం కొనసాగింది. సీబీఐ, ఈడీ నిందుతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సౌత్ గ్రూపులో కీలకంగా మారిన వారంతా ఒక్కొక్కరు అప్రూవర్స్‌గా మారుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్ ఉంటుందని చాలా సార్లు చెప్పుకొచ్చిన.. సీబీఐ ముందు హాజరైనా ఇప్పటి వరకు అలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. అందరూ అప్రూవర్స్‌గా మారుతుండటంతో మిగిలిన రాజకీయ నాయకుల ప్రమేయంపై కీలక సాక్ష్యాధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్రూవర్స్‌తో అన్ని మాఫీ అవుతాయా..? లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఆప్ పార్టీ నేత దినేష్ అరోరా మొదటిగా అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డిలు ఉన్నారు. ఇప్పుడు రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారడంతో వీరంతా కేసు నుంచి తప్పించుకున్నట్లే అనుకుంటున్నారు. అయితే రాజకీయ నాయకులకు మాత్రం ఉచ్చు బిగుసుకోనుంది. అప్రూవర్స్ గేమ్ ని స్టార్ట్ చేసిన అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా పావులు కదుపుతున్నారనే అరోపణలు ఉన్నాయి. అప్రూవర్స్ అంతా తాము చేసిన నేరం ఇలా చేశాం.. క్షమించివేయాలని పిటిషన్స్ దాఖలు చేస్తుండటంతో రాబోయే రోజుల్లో ఢిల్లీ కోర్టు తీర్పులు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దినేష్ అరోరా .. కేజ్రీవాల్‌కి క్లోజ్.. ఆప్ నేత దినేష్ అరోరా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి అత్యంత్య సన్నిహితుడు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత సాక్షిగా పరిగణించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. మనీష్ సిసోడియాను కూడా దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలంతోనే ఇంకా జైల్లో ఉంచుతున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్స్ 120బీ, 477ఏ తో పాటు అవినీతి నిరోదక చట్టం సెక్షన్ 7 నమోదు చేశారు. 32 జోన్స్ లో 849 షాపులకు సంబందిచిన రిటైల్ లైసెన్స్ లో దినేష్ కీలకంగా వ్యవహారించారు. లైసెన్స్ పొందిన శరత్ చంద్రారెడ్డి , మాగుంటి రాఘవ కూడా అధికారులకు పూర్తిగా సహకరించారు. కవితకు అంతా అరుణ్ పిళ్లైనే.. రాబిన్ డిసిల్లరిస్ , రాబిన్ డిస్ట్రిబుషన్ ఎల్‌ఎల్‌పీలు బోయినపల్లి అభిషేక్ తో కలిసి అరుణ్ రామచంద్ర పిళ్లై ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత, అభిషేక్ కు ఆర్ధిక లావాదేవీలు ఉన్నట్లు సీబీఐ, ఈడీ ఇప్పటికే చార్జీషీట్లలో పెర్కొంది. సౌత్ గ్రూపులో హైదరాబాద్ నుంచి ఇప్పటికే అరుణ్ రామచంద్రన్ పిళ్లై , బుచ్చిబాబు అప్రూవర్స్ గా మారారు. కీలక సమాచారం ఇచ్చేందుకు ఈడీ కోర్టులో కూడా అప్రూవర్ అయినట్లు పిటిషన్ దాఖలు చేయడంతో ఇక్కడ షెల్ కంపనీలు, బినామీ అకౌంట్స్ నుంచి హవాల రూపంలో జరిగిన నగదు లావాదేవీలు ఈడీ మరింత స్పష్టంగా భయటపెట్టనుంది. కవిత కొనుగోలు చేసిన భూముల వివరాలు కూడా దర్యాప్తు సంస్ధల వద్ద ఉన్నాయి. మరోవైపు సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి విడుదల చేస్తున్న లేఖలతో ఇప్పుడు కవితకు, కేజ్రీవాల్‌కి మరిత ఉచ్చు బిగుసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిందుతులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చే పెట్టేవిధంగా అప్రూవర్స్ వ్యవహారించనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన రామచంద్రన్ పిళ్ళై #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి