Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన రామచంద్రన్ పిళ్ళై

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఈ కేసులో అప్రూవర్‌గా మారడం సంచనల రేపుతోంది. 164 కింద ఈడీ అధికారులకు పిళ్ళై వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పిళ్ళై దగ్గర నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టిననట్లు తెలుస్తోంది.

New Update
Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన రామచంద్రన్ పిళ్ళై

Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఈ కేసులో అప్రూవర్‌గా మారడం సంచలనం రేపుతోంది. 164 కింద ఈడీ అధికారులకు పిళ్ళై వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పిళ్ళై దగ్గర నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టిననట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్‌పై దర్యాప్తు సంస్థల అభియోగాలు ఉన్నాయి. కొంతకాలం నుంచి ఆయన ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్ గ్రూపులోని సభ్యులు అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌లుగా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం..

రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన పిళ్లై ఢిల్లీ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఇండో స్పిరిట్‌తో పాటు కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో కీలక సమాచారం రాబట్టాయి. తాజాగా ఆయన అప్రూవర్‌గా మారడంతో రానున్న కొద్ది రోజుల్లో లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈడీ అధికారులు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు..

లిక్కర్ స్కాంలో ట్విస్టులకు కొదవ లేకుండా పోతుంది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు లంచం తీసుకున్నట్టు తేలింది. దీంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఖత్రీతో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ నితేష్ కోహర్, క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్య, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్, అమన్ సింగ్ ధాల్ ప్రవీణ్ కుమార్, బీరేందర్ పాల్ సింగ్ లపై కూడా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీ లిక్కర్ స్కాం కేసులో 5 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వ్యాపారి అమన్ దీప్ నుంచి డబ్బులు తీసుకున్నారని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అమన్ దీప్ నిందితుడిగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: మీరు తినకపోతే మానేయండి..నేను తింటాను..కనిమొళి

Advertisment
Advertisment
తాజా కథనాలు