Twitter : ట్విట్టర్(X) లో ఎక్కడ చూసినా ఇప్పుడు 'Click Here' పదమే కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు(Political Parties) క్లిక్ హియర్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నాయి. ఒకరి నుంచి చూసి మరొకరు పోస్టులు పెడుతున్నారు. అటు సెలబ్రెటిలు(Celebrities) సైతం ఇదే యూజ్ చేస్తున్నారు. ఈ 'క్లిక్ హియర్' అని పోస్టు పెట్టిన పార్టీల్లో టీడీపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు కూడా ఉన్నాయి. దీంతో అసలేంటి క్లియర్ హియర్ అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రాజకీయ పార్టీలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఫుట్‌బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు తమ సందేశాలను తెలియజేయడానికి ఈ క్లిక్ హియర్ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో, ALT టెక్స్ట్ ఫీచర్‌ని ఉపయోగించి మీమ్‌ని క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఈ పోస్టులను విమర్శిస్తున్నారు. ఇది దృష్టిలోపం ఉన్న కమ్యూనిటీకి అగౌరవంగా ఉందని ఆరోపిస్తున్నారు.
ఇది ఎలా క్రియేట్ చేయాలి?
--> ముందుగా మీ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి.
--> టాప్‌లో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఉంటుంది.
--> ఫస్ట్ మీకు ఇమేజ్ యాడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
--> అక్కడ మీరు ఈ క్లిక్ హియర్ ఇమేజ్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
--> ఆ తర్వాత ఇమేజ్ కింద ట్యాగ్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది.
--> డిస్క్రిప్షన్ సెలక్ట్ చేసుకోండి.
--> పైన మీకు Alt అని చూపిస్తూ ఉంటుంది.
--> ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి.
--> రైట్ కార్నర్లో సేవ్ అని ఉంటుంది.
--> సేవ్ చేసిన తర్వాత పోస్ట్ చేయాలి.
--> పోస్ట్ చేసిన తర్వాత ఇమేజ్‌కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో Alt అని కనిపిస్తూ ఉంటుంది.
--> అది క్లిక్ చేస్తే మీరు పెట్టిన డిస్క్రిప్షన్ కనిపిస్తుంది.
Also Read : 155.5KM.. టీమిండియా స్పీడ్ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?