Mahesh Babu-Rajamouli Movie : జక్కన్న సినిమా లో మహేశ్ బాబు పాత్ర అదేనా?

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించే టాలెంట్ ఆయన సొంతం. ప్రస్తుతం మహేశ్ బాబు తో ఆయన చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

New Update
Mahesh Babu-Rajamouli Movie : జక్కన్న సినిమా లో మహేశ్ బాబు పాత్ర అదేనా?

Mahesh Babu-Rajamouli Movie: తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించే టాలెంట్ ఆయన సొంతం. త్రిపుల్ ఆర్ (RRR Movie) తో ఆస్కార్ సొంతం చేసుకున్న రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో ఐన కళ్లుమూసుకుని ఒప్పేసుకుంటారు. అలాంటి అవకాశమే సూపర్ స్టార్‌ మహేశ్ బాబుకు వచ్చింది. వారిద్ధరి కాంబినేషన్ లో ఒక పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పుడా సినిమా ఎలా ఉండబోతుందన్న చర్చ సినీ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో రాజమౌళి, మహేశ్ బాబులు (Mahesh Babu) ఎలాంటి సంచలనానికి తెర తీయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అసలు సినిమా కథ ఏంటీ? మహేశ్ ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడనే ఉత్కంఠ సినీ ప్రేక్షకుల్లో లేకపోలేదు.

రాజమౌళి (SS Rajamouli) త్రిపుల్ ఆర్ తర్వాత ప్రేక్షకులు తిరిగి ఆశించే చిత్రం కూడా అదే స్థాయిలో ఉండాలని కోరుకోవడం సహజం. తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి ముందు రాజమౌళికి తర్వాత అని చెప్పుకునే స్థాయిలో సినిమాలు తీయడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే మహేశ్ బాబు సినిమాను కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో తీయాలని కోరుకోవడంలో తప్పులేదు.

Also Read: హనుమాన్ ఓటీటీ రిలీజ్ అప్పుడే… లాభాల్లో దూకుడు

ఈ విషయమై రాజమౌళి ఇప్పటికే కొంత క్లూ ఇచ్చినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దాని ప్రకారం మహేశ్ బాబు ఈ చిత్రంలో దేశదిమ్మరి పాత్రలో కనిపిస్తారట. అంటే హిప్పి క్యారెక్టర్ లో కనిపిస్తారన్న మాట. అంటే ఒక చోట ఉండకుండా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్తూ జీవించేవారని అర్థం. అలా తిరుగుతున్న క్రమంలో ఆయా ఏరియాల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ వారి అభిమానాన్ని పొందే క్యారెక్టర్ మహేశ్‌ చేస్తున్నారట. ఒక రకంగా ఇది మహేశ్ కు కొత్త తరహా పాత్రగానే చెప్పుకోవాలి. మహేశ్ ఇలాంటి పాత్రలో కనిపిస్తాడని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

రాజమౌళి సినిమా అంటేనే చాలా అంచనాలుంటాయి. అలాంటిది మహేశ్ తో సినిమా అంటే అదే స్థాయిలో ఉంటుందని, మళ్లీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ప్రేక్షకులు సంతోషంతో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా అభిమానుల అంచనాకు మించి ఉంటుందని మనమూ కూడా ఆశిద్ధాం.

Advertisment
తాజా కథనాలు