Gratuity: గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది? దాని నిబంధనలు తెలుసా?

రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యూటీ వస్తుందని తెలుసు. కానీ, ఒక కంపెనీలో 5 ఏళ్ళు క్రమం తప్పకుండా పనిచేసిన వారికీ గ్రాట్యుటీ వస్తుంది. గ్రాట్యుటీ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు? ఎవరికీ ఇస్తారు? ఇలాంటి సందేహాలకు సమాధానాలు టైటిల్ పై క్లిక్ చేసి అర్ధం చేసుకోండి!

Gratuity: గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది? దాని నిబంధనలు తెలుసా?
New Update

Gratuity: గ్రాట్యుటీ అనేది ఉద్యోగస్తులకు చాలా ఉపయోగకరమైన ఆర్ధిక వెసులుబాటు.  ఇది కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు యజమాని నుంచి అందుతుంది. ఇది ఒక రకమైన ఆర్థిక సహాయం.  ఇది(Gratuity) కనీసం ఐదు సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన వారికి కంపెనీ నుంచి లభించే సపోర్ట్. భారతదేశంలో ఇది 1972 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద వస్తుంది. ఈ చట్టం ఒక ఉద్యోగి ఎప్పుడు గ్రాట్యుటీకి అర్హుడు, దానిని ఎలా లెక్కించాలి అలాగే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాలను నిర్ణయిస్తుంది.

గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది?
ప్రభుత్వ శాఖలు, రక్షణ, స్థానిక ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలతో సహా వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు గ్రాట్యుటీ(Gratuity) ప్రయోజనాన్ని పొందుతారు. ఒక ఉద్యోగి అర్హత పొందాలంటే తప్పనిసరిగా ఐదేళ్ల నిరంతర సర్వీసును పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే సంస్థలకు గ్రాట్యుటీ చెల్లించాల్సిన అవసరం ఉంది. నాన్ మైనింగ్ రంగాల కోసం, ఒక సంవత్సరంలో 240 పని దినాలు ఉండాలి.  అయితే మైనింగ్ రంగాలలో ఇది 190 రోజులుగా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలలో, 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత గ్రాట్యుటీ(Gratuity) చెల్లిస్తారు. గ్రాట్యుటీ పదవీ విరమణపై మాత్రమే కాకుండా అనేక ఇతర పరిస్థితులలో కూడా ఇస్తారు.  వీటిలో రాజీనామా, మరణం లేదా వైకల్యం, రిట్రెంచ్‌మెంట్, స్వచ్ఛంద పదవీ విరమణ మొదలైనవి ఉన్నాయి.

Also Read: ఇదేం పాడు బుద్ధి.. ఈ మొగుడు నాకొద్దు.. ఓ ఇంజనీర్ భార్య నిజాయితీ!

గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారంటే..
గ్రాట్యుటీ(Gratuity) మొత్తం ఉద్యోగి చివరి జీతం అలాగే అతని పదవీకాలంపై ఆధారపడి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 ప్రకారం సంస్థ కవరేజీని బట్టి లెక్కింపు మారుతుంది. గ్రాట్యుటీ ఫార్ములా = (15 × చివరిగా తీసుకున్న జీతం × పని సంవత్సరాల సంఖ్య) / 26 – చివరిగా డ్రా చేసిన జీతంలో ప్రాథమిక జీతం అలాగే డియర్‌నెస్ అలవెన్స్ (DA) కూడా ఉంటాయి. - ఒక సంవత్సరంలో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తి చేయడం పని సంవత్సరంగా పరిగణిస్తారు. 

ఉదాహరణకు ఇలా..  
గ్రాట్యుటీ (Gratuity)మొత్తం = (చివరి జీతం) x (15/26) x (సంస్థలో పనిచేసిన సంవత్సరాల సంఖ్య). ఒక ఉద్యోగి అదే కంపెనీలో 20 ఏళ్లు పని చేశాడనుకుందాం. ఆ ఉద్యోగి చివరి జీతం రూ. 50000. ఒక నెలలో 4 రోజులు సెలవు రోజులుగా పరిగణిస్తారు. అందువల్ల 26 రోజులు మాత్రమే లెక్కిస్తారు.  గ్రాట్యుటీని నెలలో సంవత్సరంలో 15 రోజుల ఆధారంగా లెక్కిస్తారు. ఈ విధంగా, మొత్తం గ్రాట్యుటీ మొత్తం = (50000) x (15/26) x (20) = రూ 5,76,923.

#employees #explainer #gratuity
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe