Chinese food: ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటి..చైనీస్ ఫుడ్ తింటే ఏమౌతుంది..? చైనీస్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ మధ్యకాలంలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే.. ఇవి ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. By Vijaya Nimma 08 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి fried rice: సాధారణంగా మనం ఒక్కసారి వండిన ఫుడ్ ఐటమ్‌ని మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు అంటారు. ఇలా చేయడం వల్ల ఆహారంలో శరీరానికి హాని కలిగించే కెమికల్స్ ఎక్కువగా తయారవుతాయట. ఈ ఆహార పదార్థాలను తింటే రోగాలను కొన్ని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఓ వ్యక్తి ఫ్రైడ్ రైస్ తిని మరణించిన వార్త వైరల్ అనే విషయం తెలిసిందే. అయితే.. ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? ఎవరికి వస్తుందనే కారణాలు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: తులసి కోట దగ్గర ఈ వస్తువులు అస్సలు ఉంచొద్దు సాధారణంగా ఫ్రైడ్ రైస్ సీండ్రోమ్ అనేది తొలిసారిగా 2008లో వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల ఓ కాలేజీ అబ్బాయి నూడిల్స్ వండుకోని తిన్నాడు. మిగిలిన ఆ నూడిల్స్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఐదు రోజుల తర్వాత దానిని వేడి చేసుకుని తిన్నాడు. దీంతో.. ఆ నూడిల్స్ పాయిజవ్ అయింది. చివరికి ఆ నూడిల్స్ అతని ప్రాణం తీసేఎలా చేసింది. అయితే.. ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఫుడ్ పాయిజన్ అని అర్థం. వండిన పదార్థాల్ని గది ఉష్ణోగ్రత వద్ద చాలాసేపు పెట్టినప్పుడు బసిల్లస్ సెరియస్ అనే ఓ బ్యాక్టీరియా ఆహార పదార్థాన్ని విషతుల్యం చేస్తుంది. ఈ ఆహార పదార్థాన్ని తింటే జీర్ణాశయ వ్యాధులకు ఎక్కువ కారణం అవుతాయి. వండిన కూరగాయలు, మసాలా కూరలు వంటి ఇతర ఆహార పదార్థాలను ఇది ఎక్కువ ప్రభావం చేస్తుందట. ఇందులో బ్యాక్టీరియా ఒక రకమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆహార పదార్థాలను వేడి చేయటం వల్ల ఇందులో విషతుల్య రసాయనాలు విడుదలై హానికరంగా తయారవుతాయి. చిన్నపిల్లలకు ఎక్కువ రిస్క్ అయితే... బిసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా ఫామ్ అయిన ఆహార పదార్థాన్ని తిన్నా అతిసారం బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాంతులు అవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరిస్థితి నుంచి రెండు రోజుల్లో ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. అయితే.. చిన్నపిల్లలు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఈ రిస్క్‌ను ఎక్కువ అవుతుంది. అయితే.. మీరు వండుకున్న పదార్థాలు తిన్న తర్వాత మిగిలినవి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ పదార్థాన్ని చిన్న చిన్న భాగాలుగా స్టోర్ చేస్తే త్వరగా పాడవదు. ఆహార పదార్థాలను రెండు గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచితే.. దానిని బయటకు తీసిన వెంటనే తినకపోవడం చాలా మంచిది. అది పాడవకుండా ఉంటే.. వేడి చేసిన తర్వాతే తినాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. #fried-rice #syndrome #chinese-food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి