Dry Ice : డ్రై ఐస్‌ అంటే ఏమిటి? దానిని తిన్న వారు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు?

డ్రై ఐస్ తిన్న వెంటనే నోటి వేడి కారణంగా కరిగిపోతుంది. శరీరానికి చాలా తీవ్రమైన ముప్పు ఉంటుంది. డ్రై ఐస్‌ కరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్‌ వాయువుగా మారుతుంది. చుట్టుపక్కల కణజాలం, కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఓ వ్యక్తి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా.

Dry Ice : డ్రై ఐస్‌ అంటే ఏమిటి? దానిని తిన్న వారు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు?
New Update

Dry Ice Bad For Health : సోమవారం సాయంత్రం గురుగ్రామ్‌(Gurugram) లో ఓ రెస్టారెంట్ లో మౌత్‌ ఫ్రెషనర్‌(Mouth Freshener) బదులు డ్రై ఐస్‌(Dry Ice) తిన్న ఐదుగురికి నోటి నుంచి రక్త కారి పరిస్థితి విషమించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ పొరపాటు వెయిటర్‌ దే అయినప్పటికీ ఇబ్బంది పడింది మాత్రం కస్టమర్లు. మౌత్‌ ఫ్రెషనర్ బదులు పొరపాటున డ్రై ఐస్‌ అందించడం వల్ల తిన్న వారు వెంటనే రక్తపు వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారు. వారు ఆసుపత్రిలో చేరిన తరువాత వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం వారు మౌత్‌ ఫ్రెషనర్‌ బదులు డ్రై ఐస్‌ తిన్నారని... అందుకే వారు చికిత్స తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.

అసలు డ్రై ఐస్‌ అంటే ఏమిటి? దాని వల్ల ఎందుకు ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
డ్రై ఐస్ అనేది ఒక రకమైన పొడి మంచు, దీని ఉష్ణోగ్రత -80 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది ఘన కార్బన్ డయాక్సైడ్తో మాత్రమే తయారు చేస్తారు. దీనిని నేరుగా నోటిలోకి తీసుకున్నట్లయితే కరిగి నీరుగా మారి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ని విడుదల చేస్తుంది.

డ్రై ఐస్‌ ను వైద్య వస్తువులను, కొన్ని కిరాణా వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఫొటోషూట్‌ లు, థియేటర్లలలో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు.

డ్రై ఐస్ ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం?

డ్రై ఐస్ అనేది కార్బన్ డయాక్సైడ్(Carbon Dioxide) ఘన రూపం. దీనిని సాధారణంగా శీతలీకరణ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. వెంటిలేషన్ లేని ప్రదేశంలో డ్రై ఐస్‌ని ఉంచినట్లయితే, అప్పుడు కార్బన్ డై ఆక్సైడ్‌ గాఢత ఎంతగానో పెరిగి ఊపిరాడకపోవటం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు, గోర్లు నీలం రంగులోకి మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డ్రై ఐస్‌ని ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల , చర్మం దెబ్బతింటుంది. అందువల్ల, ఇది చాలా జాగ్రత్తగా వెంటిలేషన్ వాతావరణంలో ఉపయోగించాలి.

డ్రై ఐస్ తిన్న వెంటనే నోటి వేడి కారణంగా కరిగిపోతుంది. వెంటనే శరీరానికి చాలా తీవ్రమైన ముప్పు ఉంటుంది. డ్రై ఐస్‌ కరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్‌ వాయువుగా మారుతుంది. చుట్టుపక్కల కణజాలం, కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఓ వ్యక్తి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా.

డ్రై ఐస్ ను నేరుగా తాకరాదు. చర్మానికి ఎప్పుడూ కూడా దూరంగానే ఉంచాలి. దానిని తాకాల్సిన పరిస్థితులు ఏర్పడితే వస్త్రం లేదా గ్లౌస్ లు ధరించి తాకాలి. లేదంటే చర్మానికి తగిలిన వెంటనే రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు, కార్బన్ డై ఆక్సైడ్‌కు వాయువు వల్ల తలనొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వణుకు, గందరగోళం, చెవులలో కూత వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లడం, మరణానికి కూడా దారి తీసే పరిస్థితులు తలెత్తవచ్చు.

Also Read : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు

#health-tips #gurugram #dry-ice #mouth-freshener
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe