Atal Pension Yojana: రూ. 210తో నెలకు రూ. 5వేల పెన్షన్ పొందే అవకాశం..!!

అటల్ పెన్షన్ యోజన ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఉద్యోగాలు చేసే వారు పదవీ విరమణ అనంతర పరిస్థితుల గురించి ఆందోళన చెందుతుంటారు. అటువంటి పరిస్థితిలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో ప్రజలకు నెలకు రూ.5000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

Atal Pension Yojana: రూ. 210తో నెలకు రూ. 5వేల పెన్షన్ పొందే అవకాశం..!!
New Update

Benefts of Atal Pension Yojana : పదవీ విరమణ తర్వాత భవిష్యత్తు ఎలా ఆందోళన మొదలైతుంది. పదవీ విరమణ తర్వాత కూడా మనకు ఆదాయం వస్తుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీకు పదవీ విరమణ అనంతరం ప్రతినెలా పెన్షన్ పొందే అద్భుతమైన స్కీం గురించి పరిచయం చేస్తుంన్నాం. అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) అనేది ప్రభుత్వ పథకం, ఇక్కడ మీరు పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు ఎలాగో చూద్దాం.

ఈ పథకంలో మనం ప్రతి నెలా రూ.210 పెట్టుబడి పెట్టినట్లయితే...పదవీ విరమణ తర్వాత , మీరు రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. మీరు ఈ పథకంలో ఎంత తొందరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

అటల్ పెన్షన్ యోజన గురించి :
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను 9 మే 2015న ప్రారంభించింది. ఈ ఏడాదితో ఈ పథకం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఉద్యోగస్తులు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతినెలా ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడితే పెడితే 60 ఏళ్లు నిండిన తర్వాత లబ్దిదారుడికి ప్రతినెలా రూ.5,000 పెన్షన్ వస్తుంది. అయితే ఈ స్కీం బెనిఫిట్స్ పొందేందుకు మీరు 20ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా కేవలం రూ. 42 నుంచి రూ. 210వరకు చెల్లిస్తే ...మీరు ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఎవరైనా 40 ఏళ్ల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెడితే , అతను ప్రతి నెలా రూ.1,454 పెట్టుబడి పెట్టాలి. అదేవిధంగా, 19 నుండి 39 సంవత్సరాల వయస్సు గల వ్యక్తికి వేరే మొత్తం ఉంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి:
ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి, మీరు ఏదైనా బ్యాంక్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఖాతాను తెరవవచ్చు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ప్రతి నెల మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కోసం, మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం తప్పనిసరి.

Also Read: మరోసారి కొత్త ఫొటోలు పంపిన చంద్రయాన్-3..అబ్బురపరుస్తున్న పిక్స్..!!

#pension-scheme #atal-pension-yojana #atal-pension-yojana-scheme #atal-pension-yojana-benefits #benefits-atal-pension-yojana #benefts-of-atal-pension-yojana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe