విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సేఫ్ ల్యాండింగ్ కాకపోతే... శాస్త్రవేత్తల ముందు వున్న మూడు ఆల్టర్ నేటివ్స్ ఇవే...!

చంద్రయాన్-3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. ఈ చారిత్ర ఘట్టం కోసం యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇటీవల రష్యా లూనా-25, గతంలో చంద్రయాన్-2 అనుభవాల దృష్ట్యా దేశ ప్రజల్లో ఎక్కడో కొంత భయాందోళనలు వున్నాయి. ఇలాంటి క్రమంలో శాస్త్రవేత్తలు కీల విషయాలు వెల్లడించారు.

author-image
By G Ramu
New Update
విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సేఫ్ ల్యాండింగ్ కాకపోతే... శాస్త్రవేత్తల ముందు వున్న మూడు ఆల్టర్ నేటివ్స్ ఇవే...!

What if Chandrayaan-3 Misses Soft Landing Today: చంద్రయాన్-3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. ఈ చారిత్ర ఘట్టం కోసం యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇటీవల రష్యా లూనా-25, గతంలో చంద్రయాన్-2 (Chandrayaan-2) అనుభవాల దృష్ట్యా దేశ ప్రజల్లో ఎక్కడో కొంత భయాందోళనలు వున్నాయి. ఇలాంటి క్రమంలో శాస్త్రవేత్తలు కీల విషయాలు వెల్లడించారు.

విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సేఫ్ ల్యాండ్ కాకపోతే తమ వద్ద మూడు ఆప్షన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు అన్నారు. గతంలో చంద్రయాన్-2 నుంచి పొందిన అనుభవాల ఆధారంగా ఈ సారి ఈ మిషన్ ను ఫేయిల్-సేఫ్ టెక్నాలజీ తయారు చేసినట్టు ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ (ISRO Chairman Somanath) ఇప్పటికే వెల్లడించారు. ఒక వేళ రోవర్ లోని సెన్సార్స్ అన్నీ ఫెయిల్ అయినా ఇంజన్ స్టాప్ అవుతుందని, విక్రమ్ మళ్లీ ల్యాండ్ అవుతుందన్నారు.

ఏదైనా సమస్యలు ఏర్పడినా తమ వద్ద మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు వున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక వేళ విక్రమ్ ల్యాండర్ ఈ రోజు చంద్రునిపై ల్యాండ్ కాలేకపోతే ఈ నెల 24(గురువారం) మరో సారి సేఫ్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుందని చెప్పారు. సాయంత్రం 5.45 గంటలకు, అంతర్గత తనిఖీల తర్వాత చంద్రునిపై సూర్యోదయం తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

ఒక వేళ ఈ రోజు ఏదైనా పొరబాటు జరిగి సాఫ్ట్ ల్యాండింగ్ (Soft Landing) ప్రక్రియ పూర్తి కాకపోతే తమ ముందు రెండో ప్లాన్ కూడా ఉందన్నారు. చంద్రునిపై మరో సూర్యోదయం వరకు తమకు అవకాశం ఉందన్నారు. అది కూడా కుదరకపోతే తమ ముందు మూడో  మార్గం వుందన్నారు. ఏదైనా కారణాల వల్ల రేపు కూడా ల్యాండింగ్ కాకపోతే 24 నుంచి 50 గంటల్లో మరోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అదే సమయంలో ల్యాండింగ్ కోసం ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలిస్తామన్నారు.

Also Read: చంద్రయాన్-3 లైవ్ అప్‌డేట్స్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు