డెలివరీ తర్వాత మహిళల మెదడులో మార్పులు వస్తాయా? గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ముఖ్యంగా హార్మోన్, గుండె, శ్వాస, జీర్ణక్రియ, మూత్రం విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తాజా అధ్యయనం గర్భధారణ సమయంలో లేదా తర్వాత ఒక మహిళ మెదడులో మార్పులు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Health Tips: యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గర్భధారణ సమయంలో మహిళ మెదడు కూడా ఆమె శరీరంలానే గణనీయమైన మార్పులకు లోనవుతుందని అంటున్నారు. గర్భధారణకు ముందు నుంచి గర్భం దాల్చిన 9 నెలల వరకు అధ్యయనం చేశారు. మనిషి మెదడును ఇంత వివరంగా మ్యాప్ చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. గర్భధారణ హార్మోన్లు, ఎస్ట్రాడియోల్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల ఈ మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు. మెదడులో 40శాతం బూడిదరంగు పదార్థంతో నిర్మితమైతే, 60శాతం తెల్ల పదార్థంతో తయారవుతుంది. గర్భధారణ సమయంలో మెదడుపై ప్రభావాలు: బూడిద పదార్థం: మెదడులోని బూడిద పదార్థం భావోద్వేగాలు, జ్ఞాపకశక్తిని నియంత్రించే క్రియాత్మక కణజాలం. ఈ ప్రాంతం తార్కికం, విశ్లేషణ, నేర్చుకోవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం మొదలైన అన్ని ఆలోచనలకు బాధ్యత వహిస్తుంది. గర్భధారణ సమయంలో గ్రే మ్యాటర్ తగ్గడం ఆందోళన కలిగించే విషయం అయినా వాస్తవానికి ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మార్పులు యుక్తవయస్సు వారు అనుభవించే మార్పుల్లానే ఉంటాయని, గర్భం కూడా ఇలాంటి మార్పులకు కారణమవుతుందని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో మెదడులోని గ్రే మ్యాటర్ దాదాపు 4 శాతం తగ్గుతుంది. తల్లులు తమ నవజాత శిశువులతో బలమైన భావోద్వేగ బంధాలను ఏర్పరచుకోవడానికి, శిశువు అవసరాలకు అనుగుణంగా మారడానికి ఈ పరివర్తన అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. తెల్లటి పదార్థం: మెదడులోని తెల్ల పదార్థం నాడీ వ్యవస్థ నుంచి సందేశాలను పంపుతుంది, తీసుకెళ్తుంటుంది. మెదడులోని వివిధ భాగాలు, గ్రే మ్యాటర్, శరీరంలోని మిగిలిన భాగాల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడం తెల్ల పదార్థం పని. గర్భం దాల్చిన మొదటి 6 నెలల్లో మెదడులోని వివిధ భాగాల్లో తెల్ల పదార్థం పెరుగుతుందని, బిడ్డ పుట్టిన తర్వాతరువాత, శిశువు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: బెలూన్‌లాంటి పొట్టను ఇట్టే కరిగించే డ్రింక్ #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి