Toes Painful: కాళ్ల చూపుడు వేళ్లకు రాత్రి టేప్‌ వేసుకుని పడుకుంటే ఏమవుతుంది..?

ఎక్కువ సేపు నిలుచొని ఉండటం, హైహీల్స్‌ చెప్పులు ధరించడం వల్ల కాలి వేళ్లు నొప్పులు వస్తున్నాయి. రాత్రి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే ఆ సమయంలో టేప్‌ను కాలి చూపుడు వేలితో పాటు మ‌ధ్య వేలికి క‌లిపి కట్టుకోవాలి. చిన్న చిట్కాతో నొప్పిని ఇట్టే తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

New Update
Toes Painful: కాళ్ల చూపుడు వేళ్లకు రాత్రి టేప్‌ వేసుకుని పడుకుంటే ఏమవుతుంది..?

Toes Painful:ప్రస్తుత కాలంలో చాలా మంది కాలి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ సేపు నిలుచొని ఉండటం, హైహీల్స్‌ చెప్పులు ధరించడం వల్ల కాలి వేళ్లు నొప్పులు వస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే నొప్పి మరీ తీవ్రంగా మారుతోంది. అందుకే పెయిన్‌ కిల్లర్లు, స్ప్రేలు వాడుతుంటారు. చిన్న చిట్కాతో నొప్పిని ఇట్టే తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మెడికల్‌ షాపుల్లో రిజిడ్ స్పోర్ట్స్ టేప్ దొరుకుతుంది.

publive-image

ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. 38 MM మందంతో ఇది వస్తుంది. దీన్ని కాలి చూపుడు వేలితో పాటు మ‌ధ్య వేలికి క‌లిపి కట్టుకోవాలి. ఇలా రాత్రి సమయంలో చేస్తే ఉపయోగం ఉంటుంది. నొప్పులన్నీ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో కాళ్లను ఎక్కువగా కదిలించం కాబట్టి ఆ సమయంలోనే వర్కౌట్‌ అవుతుందని అంటున్నారు. ఉద‌యం టేపును తొలగించాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల కాళ్లలో ఉండే సాధారణ నొప్పులన్నీ తగ్గిపోతాయి.

ఒత్తిడి తగ్గుతుంది:

అంతేకాకుండా.. పాదాలపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. నడుస్తున్నప్పుడు పాదాలు మంచిగా భూమిపై ఆనుకునేలా మంచి షేప్‌ కూడా వస్తుందని చెబుతున్నారు. పాదాలు, కాళ్ల అడుగుభాగంలో గాయాలు కూడా తొందరగా మానుతాయి. ఎక్కువ రన్నింగ్‌ చేసినా ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఏదైనా గేమ్స్‌ ఆడేప్పుడు ఇలా టేప్‌ను చుట్టుకుంటే వేళ్లపై ఒత్తిడి పడదు. గాయాలు కాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకవేళ టేప్‌ వేసుకునేప్పుడు వాపు వచ్చినా, ఎరుపుగా మారినా, దురద వచ్చినా ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మూత్రపిండాల ఆరోగ్యం కళ్లలో కూడా తెలుస్తుందా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు