కడుపుతో ఉన్న మహిళలు తీసుకున్న ఆహారం బొడ్డు ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు నేరుగా చేరుతుంది. అందుకే పుట్టిన సమయంలో నవజాత శిశువు.. బొడ్డు తాడు (అంబిలికల్ కార్డ్)తో తల్లికి జీర్ణాశయానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రేగును మాయ, పిండానికి పోషకాల సంచి అని పిలుస్తుంటారు. ఇక గర్భంలో పెరిగే బిడ్డ బయట ప్రపంచంలోకి రావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటప్పుడు ప్రతి ఒక్క విషయంపై ప్రత్యేక శ్రధ్ద చూపించడం చాలా ముఖ్యం. పుట్టిన పసికందు తల్లి బొడ్డు తాడుతో బయటకు వస్తుంది. అయితే ఆ బొడ్డు తాడు కత్తిరించే సమయం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఎంత సమయం లోపు ఆ తాడు కత్తిరించాలి? ఒక వేల కట్ చేయడం లేట్ అయితే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే విషయాల గురించి వివరిస్తున్నారు.
సాధారణంగా కడుపులో నుంచి బిడ్డ బయటకు బొడ్డు తాడుతో వస్తాడు. దాన్ని ముడివేసి కత్తిరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)నివేదిక ప్రకారం బొడ్డు తాడు ముడి వేసి కట్ చేయడానికి ఒక నిమిషం సమయం తీసుకుంటారు. దానిని ఎర్లీ కార్డ్ క్యాంపింగ్ అంటారు.కానీ కొన్ని సమయాలలో బొడ్డుతాడు కట్ చేయడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటారు. అయితే బొడ్డు తాడును ఆలస్యంగా కత్తిరించినపుడు నవజాత శిశువు, మాయ మధ్య రక్తప్రవాహం కొనసాగుతుంటుంది. దీని వల్ల బిడ్డ ఐరన్ స్థాయి పెరుగుతుంది. ఈ ప్రభావం బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు ఉంటుంది.అలాగే కొంత మంది పిల్లలు వీక్‌గా ఉంటే వెంటిలేషన్‌లో ఉంచుతారు. అలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదంటే.. పుట్టిన వెంటనే బొడ్డు తాడును ఒక నిమిషం కంటే ముందు కత్తిరించకూడదు.
అప్పటి వరకు బిడ్డకు పోషకాలు, ఆక్సిజన్ ఆ బొడ్డు తాడుతో అందుతాయి. కానీ బిడ్డ గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత తను గాలి నుంచి ఆక్సిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. శిశువు ఊపిరితిత్తులు పని చేయడానికి కనీసం ఒక నిమిషం పడుతుంది. అందుకే ఒకసారి బిడ్డ ఆ మార్పుకు అలవాటు పడితే, తను ప్లాసెంటా నుంచి కూడా శిశువు బయటకు వచ్చేయగలదు. అందుకే డెలివరీ తర్వాత శిశువు ప్లాసెంటా నుంచి బయటకు వచ్చే వరకు వేచి చూడాలి. ఆ తర్వాత బొడ్డు తాడు కత్తిరించాలి. అలా కాకుండా పుట్టిన వెంటనే కార్డ్ క్లాంపింగ్ చేస్తే.. శిశువు హార్ట్ బీట్ పెరుగుతుంది. శిశువు హెల్త్ కండిషన్ వేరువేరుగా ఉంటుంది. డెలివరీ పూర్తిగా నార్మల్ అయితే, ఎలాంటి సమస్య లేకపోతే, ఈ పద్ధతి పాటించవచ్చు. కానీ.. ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించాలి.