Crow Cries House: ఇంటి ముందు కాకి అరిస్తే ఏం జరుగుతుంది? ప్రత్యేకత ఇదే ప్రకృతిలో మనం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. ఒక్కో పక్షికి ఒక్కో ప్రత్యేకత ఉంటే.. పక్షుల్లో కాకికి ఓ ప్రత్యేకత ఉంది. కర్మకాండలు చేసేప్పుడు కాకిదే ప్రధాన పాత్ర. పూర్వీకులు ఈ కాకుల రూపంలోనే మన పరిసరాల్లో తిరుగుతారని నమ్మకం కూడా ఉంది. By Vijaya Nimma 01 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Crow Cries in House: ప్రకృతిలో అనేక జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. అందులో పక్షులు కూడా ఒకటి. నిత్యం మనం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. ఒక్కో పక్షికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే పక్షుల్లో (crow)కాకికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా పక్షుల అరుపులను అంతగా పట్టించుకోం కానీ.. కాకి అరుపునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాకి అనేది మన పితృదేవతలకు ప్రతినిధి అని హిందూధర్మాలు చెబుతున్నాయి. కర్మకాండలు చేసేప్పుడు కాకిదే ప్రధాన పాత్ర. మనం పిండాలను కాకి ముడితేనే చనిపోయినవారి ఆత్మకు శాంతి అని అంటుంటారు. పూర్వీకులు ఈ కాకుల రూపంలోనే మన పరిసరాల్లో తిరుగుతారని నమ్మకం కూడా ఉంది. ఇది కూడా చదవండి: లూజ్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫ్యాషన్ బాసూ.. ఈ బట్టలతో ఎంతో ఆరోగ్యం కూడా! కాకి కదలికలను బట్టి కూడా శకునాలు, శుభం..అశుభం అనేది పెద్దలు చెబుతుంటారు. అలాంటి శకునాలు..వాటి కారణంగా జరిగే ఫలితాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇంటిపైగానీ ఇంటి ముందుగానీ కాకి వచ్చి అరుస్తే బంధువులు వస్తారని ఎప్పటి నుంచో మనం నమ్ముతున్నాం. అదే కొన్ని కాకుల సమూహం వచ్చి అరిస్తే ఏదో కీడు జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. కాకి ఒక్కసారిగా మన శిరస్సుపై వాలితే చెడు జరుగుతుందని, ప్రాణాలకే ప్రమాదం అని కూడా కొందరు అంటుంటారు. కాకపోతే కంగారు పడాల్సిందేమీ లేదని, కాకి వాలిన మరుక్షణమే తలస్నానం చేస్తే ఎలాంటి నష్టమూ ఉండబోదని, ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించాలని కూడా సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: గొంతులో ఆహారం ఇరుక్కుంటే యమ డేంజర్.. అప్పుడు ఇలా చేయండి! ఒక పని మీద మనం బయటికి వెళ్లేప్పుడు కాకి (crow)కుడి నుంచి ఎడమవైపునకు వస్తే ఆ పనికి తిరుగుండదని పెద్దలు చెబుతున్నారు. అలాగే కాకి ఎడమ నుంచి కుడివైపునకు వస్తే అశుభం కలుగుతుందని, వెళ్లిన పని పూర్తికాదని అంటున్నారు. అలాంటప్పుడు వెంటనే ఇంట్లోకి వచ్చి కాళ్లు శుభ్రంగా కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకుని బయటికి వెళ్తే ఎంతో మంచిదని శకునాల ప్రకారం చెబుతున్నారు. #crow #crow-cries-in-house మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి