Pregnancy: గర్భధారణ సమయంలో అమ్నియోటిక్ ద్రవం పోవడం ఒక సాధారణ, ముఖ్యమైన ప్రక్రియ. ఇది డెలివరీ సమీపంలో ఉంటుందని సూచిస్తుంది. "అమ్నియోటిక్ శాక్" అని పిలవబడే ఈ సంచి కడుపులో ఉన్న శిశువుకు రక్షణ, పోషణను అందిస్తుంది. డెలివరీ సమయం సమీపించినప్పుడు ఈ సంచి నుంచి నీరు కారుతుంది. దీనిని సాధారణంగా ఉమ్మనీరు కారడం అంటారు. గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.
అమ్నియోటిక్ శాక్ పగిలిపోవడం:
- గర్భం దాల్చిన 37 నుంచి 40 వారాలు పూర్తయినప్పుడు ఉమ్మనీరు సంచి నుంచి పోతుంది. ఇది కారిన తర్వాత డెలివరీ ప్రక్రియ ప్రారంభమై కొన్ని గంటల్లో బిడ్డ బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో ప్రతిదీ సాధారణమైనప్పుడు తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారు.
ఎంత ప్రమాదకరమైనది:
- ఉమ్మనీరు 37 వారాల ముందు బయటకుపోతే.. అది ఆందోళన కలిగిస్తుంది. దీనిని ప్రీమెచ్యూర్ ర్యాప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అని పిలుస్తారు. ఈ స్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరూ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే సంచి చీలిపోయిన తర్వాత శిశువు బాహ్య వాతావరణంతో ప్రత్యక్ష సంబంధంలోకి రావచ్చు. అంతేకాకుండా పిల్లల ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఉమ్మనీరు ముందే బయటకు వస్తే ఏం చేయాలి:
- సరైన సమయంలో ఉమ్మనీరు పోవడం సహజమైన ప్రక్రియ. 37 వారాల ముందు ఉమ్మనీరు కారినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. డాక్టర్ పరిస్థితిని అంచనా వేసి సకాలంలో చికిత్స చేస్తారు. దీంతో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారు. అది ముందుగానే పోతే దానిని తేలికగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.