Thirupathi: ప్రాణం తీసిన ఎగ్ ఫ్రైడ్ రైస్.. అసలేం జరిగిందంటే..? ప్రస్తుతం సమాజంలో ఏం తిన్నాలన్నా భయమేస్తుంది. ఫాస్ట్‌పుడ్స్ ఎక్కువ కావడం.. ప్రజలు కూడా త్వరగా రెడీ అయ్యే ఆహారం వైపే మొగ్గు చూపడంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటనూనె దగ్గరి నుంచి ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కొంతమంది వ్యాపారులు కూడా లాభాల కోసం కల్తీ పదార్థాలు వాడుతున్నారు. By BalaMurali Krishna 23 Sep 2023 in తిరుపతి క్రైం New Update షేర్ చేయండి Thirupathi: ప్రస్తుతం సమాజంలో ఏం తిన్నాలన్నా భయమేస్తుంది. ఫాస్ట్‌పుడ్స్ ఎక్కువ కావడం.. ప్రజలు కూడా త్వరగా రెడీ అయ్యే ఆహారం వైపే మొగ్గు చూపడంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటనూనె దగ్గరి నుంచి ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కొంతమంది వ్యాపారులు కూడా లాభాల కోసం కల్తీ పదార్థాలు వాడుతున్నారు. దీంతో ప్రజలకు తెలియకుండానే కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్‌తో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. న్యాయం చేయాలని డిమాండ్.. కాలూరుకు చెందిన నరేందర్ అనే 27ఏళ్ల యువకుడు దగ్గర్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు. అనంతరం ఇంటికి వెళ్లాక ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు హుటాహుటిన స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్‌ఎంపీ లేకపోవడంతో సిబ్బందే వైద్యం చేశారు. అయితే మెరుగైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందాడు. క్లినిక్‌లో సిబ్బంది అందించిన వైద్యం పైనా తమకు అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో పాటు యువకుడి భార్య కన్నీటిపర్యంతమవుతున్నారు. కల్తీ చేయలేదంటున్న నిర్వాహకులు.. అంతకుముందు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఎగ్ ఫ్రైడ్ రైస్ విక్రయించిన దుకాణం షాపుపై పోలీసులు కేసు నమోదుచేశారు. షాపులో తనిఖీలు కూడా చేశారు. అయితే ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు మాత్రం తాము ఎలాంటి కల్తీ పదార్ధాలు వినియోగించలేదని చెబుతున్నారు. కావాలంటే అధికారులు రోజు వచ్చి తనిఖీ చేసుకోవచ్చని చెబుతున్నారు. కల్తీ ముఠాపై చర్యలు తీసుకోవాలి.. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా మాత్రం కలకలం రేపుతోంది. కల్తీ ఆహారంతో చిన్న వయసులోనే ఓ యువకుడు అకాలంగా మరణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కల్తీ పదార్థాలు విక్రయిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి #tirupathi #boy-died #egg-fried-rice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి