ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు ఏమన్నారంటే?

సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి చెట్టు-బొట్టుగా పేరు పెట్టారు. రాష్ట్రంలో మొక్కలు పంచడాన్ని ప్రజలు ప్రోత్సహించాలని కౌన్సిలర్లు సిబ్బందికి సూచించారు.

New Update
ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు ఏమన్నారంటే?

ఇంటింటికి మొక్కల పంపిణీ

సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమానికి చెట్టు - బొట్టుగా పేరు పెట్టామని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనదని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు చెప్పారు.

స్వచ్చమైన తాగు నీరు:
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదని.. వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరం ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రజలకు స్వచ మైన గాలి అందించలాని.. వారి ఊపిరితిత్తులను కాపాడాలన్నారు. అందుకు చెట్లు పెంచడం మెరుగైన మార్గం అని చెప్పారు. చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృద్ది జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అదే విధంగ తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా స్వచ్చమైన తాగు నీరు ఇంటింటికీ అందిస్తున్నామని పేర్కొన్నారు.

మొక్కల పెంపకం

వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి స్వచమైన గోదావరి నీళ్ల తో పండించిన పంట అందించాలి అన్నది తమ ఆంకాక్ష అని వారు పేర్కొన్నారు. అందుకోసమే హరిత హరంలో బాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామని చెప్పారు. అంతేకాకుండా అందులో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త తీయడం ఒక మంచి పరిణామం అని వ్యాఖ్యనించారు. కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన, చేతన కలుగుతుంది అనీ దానివల్ల పర్యావరణ పరిశుభ్రత జరుగుతుంది. మున్సిపల్ సిబ్బంది, కార్మికులు ఈ విషయంలో చాలా బాగా పని చేస్తున్నారనీ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు మెచ్చుకున్నారు. జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో సిద్ధిపేట జిల్లా రెండో స్థానంలో ఉందనీ.. ఇంకా కలెక్టర్‌తో పాటుగా జాయింట్ కలెక్టర్లకి సిబ్బంది, కూడా మరింత కష్టపడితే మొదటి స్థానంలో ఉంటామని చెప్పారు. అంతేకాకుండా మొక్కలు పంచడమే కాదు నాటి పెంచే విధంగా కౌన్సిలర్లు సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలని కౌన్సిలర్లను హరీష్‌రావు సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు