పిల్లలు నిద్ర లేవడంలేదనే కోపంతో తల్లి వారిపై వేడినీళ్లు పోసిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల సాయిలు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు శ్రీనిధి, రిత్విక్ల స్కూల్కు టైమ్ అవుతుండటంతో.. తల్లి సంతోష వారిని పలు మార్లు లేపింది. తల్లి వచ్చినప్పుడు లేచిన పిల్లలు.. ఆమె బయటకు వెళ్లగానే మళ్లీ పడుకున్నారు. పిల్లలు లేవడంలేదనే కోపంతో ఊగిపోయిన సంతోష పిల్లలపై వేడినీళ్లు పోసింది. దీంతో శ్రీనిధి, రిత్విక్లకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లల అరుపులు విన్న స్థానికులు ప్రమాద స్థలికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన కుమారుడు రుత్విక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Medak: పిల్లలు నిద్రలేవడంలేదని తల్లి ఏం చేసిందంటే.!
మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Translate this News: