WhatsApp vs Govt of India: వాట్సాప్‌ VS కేంద్ర ప్రభుత్వం.. కోర్టుకు వెళ్లిన పంచాయితీ

కొత్త ఐటీ రూల్స్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు వేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ.. కేంద్ర ఐటీశాఖ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భారత వినియోగదారుల ప్రాథమిక హక్కులను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.

New Update
WhatsApp vs Govt of India: వాట్సాప్‌ VS కేంద్ర ప్రభుత్వం.. కోర్టుకు వెళ్లిన పంచాయితీ

ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వాట్సాప్‌లోని ఎండ్‌ టూ ఎండ్‌ ఇన్‌స్క్రిప్షన్‌ను తీసివేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తాము వాట్సాప్‌ సేవల్ని భారత్‌లో నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే కేంద్ర ఐటీశాఖ కేవలం ఈ ఒక్క రూల్ మాత్రమే కాదు.. మరికొన్ని నిబంధలను కూడా పాటించాలని వాట్సాప్‌ను కోరింది.

ఎక్కువ డబ్బు, తక్కువ ప్రైవసీ
కొత్తగా సవరించిన ఐటీ రూల్స్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు వేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ.. కేంద్ర ఐటీశాఖ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటా మానిటైజ్ చేసేటప్పుడు వారి గోప్యతను రక్షిస్తామని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు క్లెయిమ్ చేసుకోలేవని పేర్కొంది. భారత వినియోగదారులకు దేశంలోని వివాదాస్పద అంశాలకు సంబంధించి యాక్సెస్‌ ఇవ్వకుండా వారి ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘించిందని పిటీషన్‌లో ఐటీశాఖ వివరించింది. 2021లో తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఈ రూల్స్‌ పాటించడంలో విఫలమైతే.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఫేక్‌ మెసేజ్‌లను ట్రాక్‌ చేయడంలో ఆటంకం ఎదురవుతందని.. దీనివల్ల సామాజిక అశాంతికి దారి తీస్తుందని పేర్కొంది.

రూల్స్ పాటించకుంటే బాధ్యత వహించాల్సిందే

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు.. వినియోగదారులకు, దేశ చట్టాలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే హక్కు ఎలాంటి సంస్థకు లేదని స్పష్టం చేసింది. అలాగే తాము తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌ని కూడా భారత్‌ సమర్థించింది. డిజిటల్ రంగంలో మధ్యవర్తుల బాధ్యతలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆమోదింపబడిన నిబంధనలు అనుగుణంగానే తాము తీసుకొచ్చిన ఐటీ రూల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఒకవేళ వాట్సాప్ లేదా ఫేస్‌బుక్.. హానికర కంటెంట్‌ను సృష్టించకపోయినప్పటికీ.. వాటిని తొలగించడంలో విఫలమైతే బాధ్యత వహించాల్సి ఉంటందని ప్రభుత్వం వాదించింది.

Advertisment
తాజా కథనాలు