Black Foods Benefits: బ్లాక్ ఫుడ్స్ అంటే ఏంటి.. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి.? బ్లాక్ ఫుడ్స్.. ఈ పేరు వినగానే కొందరికి డౌట్ వస్తుంది. నలుపు రంగులో ఉంటాయేమో అని అనుకుంటారు. అయితే.. ఆంథోసయనిన్స్ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్ ఫుడ్స్ అంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. By Vijaya Nimma 10 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Black Foods Benefits: ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కొంచెం కష్టమే. కానీ.. చాలామంది ఆరోగ్యంగా ఉండాలని తాపత్రయంతో ఎన్నో ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. వీటిలో పండ్లు, కూరగాయలు, నట్స్, చిరుధాన్యాలు తీసుకుంటారు. కానీ.. జింక్ ఫుడ్ ను మాత్రం దూరం పెట్టేస్తారు. అయితే.. వీటితో పాటు బ్లాక్ ఫుడ్స్‌ని కూడా రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. వీటిలో ఉండే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును దూరం చేసి రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. అయితే.. అసలు బ్లాక్ ఫుడ్స్ ఏంటీ..? వాటిల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటి..? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: వేగంగా నడిస్తే మధుమేహం తగ్గుతుందా?..పరిశోధనల్లో ఏం తేలింది..? నల్ల బియ్యాన్ని ఎప్పుడైనా చూశారా..? పేరుకు తగినట్లే ఈ బియ్యం నల్లగా ఉంటాయి. ఈ ధాన్యంలో ఉండే జియాంథిన్, ల్యూటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపడుతుంది. వీటిల్లో ఉండే పుష్కలు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇక ఈ రైస్‌తో ఇడ్లీ, బిరియానీ, ఖీర్, పులావ్, పుట్టు, దోస వంటివి చేసుకోని తీనవచ్చు. మనం ఎంతో ఇష్టంగా తినే మినుముల్నే నల్ల పప్పుగా పిలుస్తారు. వీటితో దాల్ మఖానీ, రోటీ, మినప సున్నుండలు వంటి వంటల్లో ఈ పప్పును వాడుతుంటాం. మినములు ఎంతో రుచితో పాటు ఫైబర్, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్, ప్రొటీన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పప్పును ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులోఉంచి.. రక్తప్రసరణను మెరుగు పరిచేందుకు సహాయ పడుతుంది. జుట్టు సంరక్షణకు బ్లాక్ ఆలివ్స్ కీలక పాత్ర వీటితో పాటు వెల్లుల్లి అంటే తెల్లవే కాదు నల్ల వెల్లుల్లి కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సుగుణాలు యాంటీ క్యాన్సర్‌ను రానికుండా చేస్తోంది. బ్లాక్ ఆలివ్స్‌ల్లో మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, పాలీఫినోల్స్, నొప్పిని తగ్గించి.. కంటి ఆరోగ్యానికి, చర్మ, జుట్టు సంరక్షణకు ఈ బ్లాక్ ఆలివ్స్ కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం, పొట్ట, మెదడు, రోగనిరోధక శక్తికి నల్ల పుట్టగొడుగులు మంచిది. నల్ల మిరియాలు, బ్లాక్‌బెర్రీస్ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచిది. వీటిని తింటే అనారోగ్యంతోనైనా సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #black-foods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి