Upcoming Telugu Movies: ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant). బిగ్ బాస్ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన సినిమా ఇది. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరరెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో గర్భందాల్చిన పురుషుడిగా కనిపించబోతున్నాడు హీరో. తెలుగుతెరపై ఇదో సరికొత్త ప్రయత్నం. సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ, అలీ లాంటి ప్యాడింగ్తో వస్తున్న సినిమా ఇది.
పూర్తిగా చదవండి..Upcoming Telugu Movies: భోళా ఖాళీ.. అప్ కమింగ్ సినిమాల సంగతేంటి..?
భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అయింది. థియేటర్లలో ఈ సినిమా అస్సలు నడవడం లేదు. ఆగస్ట్ 15 ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై కనిపించడం లేదు. పైపెచ్చు, చాలా థియేటర్ల నుంచి భోళాను ఖాళీ చేయించి, జైలర్‌కు ఇచ్చారు. ప్రస్తుతం థియేటర్లలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఈ వీకెండ్ 5 సినిమాలొస్తున్నాయి.
Translate this News: