పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా దాగుడుమూతలు ఆడుతోంది వాతావరణం. నిన్న జిల్లా వ్యాప్తంగా మేఘామృతం.. కొన్ని చోట్ల చిరుజల్లులు పడింది. ఇదిలాంటే నేడు వేసవిని తలపించే విధంగా ఎండ కోడుతోంది. మరోవైపు పంట పొలాలు బీడు బారుతున్నాయి. సాధారణంగా ఈ నెలలో రైతులు నారు మడులు వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వర్షాలు కురవకోవపోవడం.. కాలువల్లో నీరు శివారు పంట పొలాలకు అందకపోవడంతో పంట పొలాలు బీడు భూములుగా మారిన్నాయి. పరిస్థితి ఇలానే వుంటే క్రాప్ హాలిడే దిశగా రైతులు ఉన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు.