క్రాప్ హాలిడే దిశగా పశ్చిమగోదావరి రైతులు

దక్షిణ కోస్తా ఏపీలో రేపు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్‌లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఏపీ, యానాం ప్రాంతాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు.

New Update
క్రాప్ హాలిడే దిశగా పశ్చిమగోదావరి రైతులు

West Godavari farmers towards crop holiday<br />

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా దాగుడుమూతలు ఆడుతోంది వాతావరణం. నిన్న జిల్లా వ్యాప్తంగా మేఘామృతం.. కొన్ని చోట్ల చిరుజల్లులు పడింది. ఇదిలాంటే నేడు వేసవిని తలపించే విధంగా ఎండ కోడుతోంది. మరోవైపు పంట పొలాలు బీడు బారుతున్నాయి. సాధారణంగా ఈ నెలలో రైతులు నారు మడులు వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వర్షాలు కురవకోవపోవడం.. కాలువల్లో నీరు శివారు పంట పొలాలకు అందకపోవడంతో పంట పొలాలు బీడు భూములుగా మారిన్నాయి. పరిస్థితి ఇలానే వుంటే క్రాప్ హాలిడే దిశగా రైతులు ఉన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు