Hyderabad: వచ్చే నెల 28న హైదరాబాద్ (Hyderabad) లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ ను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. బయో ఏషియా -2024 మీటింగ్ లో భాగంగా నగరంలో ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ను ప్రారంభించనున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్డే బ్రెండే ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి (Reavanth Reddy) మీటింగ్ జరిపారు.
అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్‌తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పని చేస్తే ప్రజలను సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని..అందుకే రెండింటి మధ్య అద్బుతమైన సమన్వయం కుదిరింది. ప్రజల జీవితాలు జీవన నాణ్యత ప్రమాణాలు, జీవన విధానాలు బాగుపడతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టబడి ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆ లక్ష్యంతోనే......
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే ..తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంఓని 4 కోట్ల మంది ప్రజల పై దృష్టి కేంద్రీకరిస్తోందని దీని వల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జీవితాన్ని అందించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని రేవంత్ అన్నారు.
‘ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం అన్నారు.
Also read: రెండు బొమ్మలను టెంట్ లోపల ఉంచి రాముడంటున్నారు..కర్నాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు!