TG News: తెలంగాణలో మరో మూడు రోజులు వాతావరణ హెచ్చరికలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతోపాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

New Update
TG News: తెలంగాణలో మరో మూడు రోజులు వాతావరణ హెచ్చరికలు

TG News: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజలు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములతోపాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

సోమవారం విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఋతుపవన ద్రోని మంగళవారం సగటు సముద్ర మట్టం నుంచి జై సేల్మేర్, ఉదయపూర్, పశ్చిమ విదర్భ వద్ద ఉన్న అల్పపీడన కేంద్రం, దాని పరిసర ప్రాంతాల్లోనూ రామగుండం కళింగపట్నం అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఏర్పడిందని వాతావరణ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు