/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Weather-Update.jpg)
Weather Update: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఏపీలో 149 మండలాల్లో తీవ్ర వడగాలులు.. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నట్లు చెప్పింది. అలాగే ఉత్తరకోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి. పలు జిల్లాలలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నాలుగు ఐదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు చేరుతాయని.. గత ఏడాది కంటే ఈ ఏడాది భారత్ లో అధిక వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Follow Us