Summer: వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎండలు..అది కూడా కేవలం ఏప్రిల్‌ నెలలోనే!

ఏప్రిల్ నెలలో కాసిన ఎండలు ఇప్పటి వరకు వేడి పేరుతో ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టాయి. దాదాపు 103 సంవత్సరాల తర్వాత అనేక చోట్ల పాదరసం 43 డిగ్రీలకు చేరుకుని రికార్డులు నెలకొల్పింది.

Summer: వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎండలు..అది కూడా కేవలం ఏప్రిల్‌ నెలలోనే!
New Update

అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, తీవ్రమైన వడగాల్పులు.. ఏప్రిల్‌ నెలలో వాతావరణం పరిస్థితి ఇది. ఏప్రిల్ నెలలో కాసిన ఎండలు ఇప్పటి వరకు వేడి పేరుతో ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టాయి. దాదాపు 103 సంవత్సరాల తర్వాత అనేక చోట్ల పాదరసం 43 డిగ్రీలకు చేరుకుని రికార్డులు నెలకొల్పింది.

ఏప్రిల్‌ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందో అని ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణశాఖ సుమారు 100 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న వాతావరణ డేటాను వివరించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్‌ నెల చాలా వేడిగా ఉంటుందని ఈ డేటా చూపిస్తుంది.

రానున్న ఐదు రోజుల్లో ఈ వేడి గాలులు మరింత వేడిగా మారనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలో వేడి గాలుల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఈ తీవ్రమైన వేడి రాబోయే ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యుడు కూడా తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తున్నాడు.

బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందిఏప్రిల్, మే నెలలకు సంబంధించి, ఈ రెండు నెలలు ఇతర సంవత్సరాల కంటే వేడిగా ఉండవచ్చని వాతావరణ శాఖ గతంలో కూడా చెప్పింది. ప్రధాని జరిగిన సమావేశంలో కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

వాతావరణశాఖ అధికారులు తెలిపిన డేటా ప్రకారం, హీట్‌వేవ్ ఇండెక్స్ 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు కనిపిస్తుంది. కేరళ సహా తూర్పు తీరంలోని పలు ప్రాంతాల్లో ఈ సూచీ 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది.

Also read: ఘోర ప్రమాదం..పెళ్లి ఊరేగింపు పై పడిన ట్రక్కు.. 6 గురు మృతి!

#april #heatwave #summer #may
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe