Andhra Pradesh Weather Forecast: బాబోయ్.. వేసవి కాలం వెళ్లి వర్షాకాలం వచ్చినా.. వాతావరణం మాత్రం వేసవినే తలపిస్తోంది. భగభగ మండుతున్న సూర్యడి దెబ్బకు తాళలేక ప్రజలు అల్లాడి పోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మొదట్లో దంచికొట్టిన వర్షాలు.. ఇప్పుడు కనీసం జాడనైనా లేకపోవడంతో జనాలు వేడిమికి ఉడికిపోతున్నారు. వరణుడా కరునించి అంటూ వేడుకుంటున్నారు. మరి ఆ వరుణుడు జనాల మాట విన్నాడో ఏమో గానీ.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే మూడు రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందంటూ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈశాన్య బంగాళాఖాతం, పొరుగు ప్రాంతములో ఉపరితల ఆవర్తనం కేంద్రం నుంచి దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతర్గత కర్ణాటక నుంచి కొరిమను ప్రాంతం వరకు ఒక ద్రోణి సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా గల ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరం వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలహీనపడింది. అయితే, వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతోందో వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. మరి ఏయే ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఉత్తర కోస్తాంధ్ర..
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో శుక్రవారం నాడు తేలికపాటి ఉంచి ఒక మోస్తరు వర్షాలు గానీ, ఉరుములతో కూడిన జల్లులు గానీ కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఒకటి రెండు చోట్ల మాత్రం ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దక్షిణ కోస్తాంధ్ర..
దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. శుక్రవారం నాడు కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లోనూ దాదాపుగా ఇదే రకమైన వాతావరణం ఉండనుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురువనున్నాయి.
రాయలసీమ..
రాయలసీమలో శుక్రవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. శనివారం నాడు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే ఆదివారం నాడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read: YSR Rythu Bharosa: ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంక్ అకౌంట్‌లోకి ఎంత జమ అవుతుందంటే?