Roldgold Jewellery: రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటున్నారా..అయితే ఈ వ్యాధులు ఖాయం

కృత్రిమ ఆభరణాలు వేసుకోవటం వల్ల చర్మవ్యాధులు,అలర్జీలు వస్తున్నాయి. మెడకు చుట్టూ బొబ్బలు, దద్దుర్లు, చర్మం నల్లగా మారితే.. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు ఉంటే కృత్రిమ నగలు ధరించకపోవడమే మంచిది.

New Update
Roldgold Jewellery: రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటున్నారా..అయితే ఈ వ్యాధులు ఖాయం

Roldgold Jewellery: నిజమైన ఆభరణాల కంటే కృత్రిమ ఆభరణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వాటి వల్ల కొందరికి చర్మవ్యాధులు వస్తున్నాయి. నేడు మార్కెట్‌లో రకరకాల డిజైన్‌లలో కళ్లు చెదిరే కృత్రిమ నగలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఎవరైనా కొనాలని అనిపిస్తుంది. దీని వల్ల కొందరికి చర్మంలో అలర్జీలు కూడా వస్తున్నాయి. అంటే వీటిని ధరించిన తర్వాత గాయాలు, రక్త స్రావం, చీము కూడా వస్తుంటుంది.

కారణాలు ఏంటి?

  • మహిళలు ఉపయోగించే అనేక కృత్రిమ ఆభరణాలలో నిఖల్ అనే ఖనిజాన్ని ఉపయోగిస్తారు. కానీ కొంతమంది మహిళల సున్నితమైన చర్మానికి ఇది సరిపోకపోవచ్చు. శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ఈ నిఖల్‌ ఖనిజాన్ని అనుమతించదు. కాబట్టి ఇది చర్మంపై గాయం లేదా రక్తస్రావంలా మారుతుంది. కొందరికి మెడకు గొలుసు తగిలితే చుట్టూ బొబ్బలు లేదా దద్దుర్లు వస్తాయి. అలాగే చర్మం నల్లగా మారుతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.

చర్మ సమస్యలు కనిపించవచ్చు:

  • ఎవరికైనా ఇప్పటికే చాలా సెన్సిటివ్ స్కిన్ లేదా డ్రై స్కిన్ ఉన్నా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉంటే కృత్రిమ నగలు ధరించకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

స్క్రాచ్ లేదా దద్దుర్లు:

  • చర్మంపై గీతలు లేదా దద్దుర్లు ఉంటే కృత్రిమ నగలు వేసుకోవడం మానేయాలి. అంతేకాకుండా స్కిన్‌ స్పెషలిస్ట్‌ దగ్గర పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్‌ రాసిచ్చిన స్కిన్ క్రీమ్‌ను ప్రతిరోజూ వాడుకోవాలి. అలాగే చర్మానికి మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.

ఏ ఆభరణాలు ధరించవచ్చు:

  • నికెల్‌తో చేసిన ఆభరణాలు ధరించవద్దు. సర్జికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, వెండి, ప్లాటినం ఆభరణాలు ధరించవచ్చు.

ఇది కూడా చదవండి: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఒక్కసారిగా బీపీ తగ్గితే ఏం చేయాలి?.. ఈ చిట్కాలు ఫాలో అవండి

Advertisment
తాజా కథనాలు