Minister Satya Kumar: వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం: మంత్రి సత్యకుమార్ AP: వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని అన్నారు మంత్రి సత్యకుమార్. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని అన్నారు. By V.J Reddy 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Minister Satya Kumar: యనమకుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రాణం నిలబెట్టే ఆస్పత్రులు నిజమైన దేవాలయాలు అని అన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి కారణమైన వెలగపూడి ట్రస్ట్ దాతృత్వం వెలకట్టలేనిదని కొనియాడారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని అన్నారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తాం అని చెప్పారు. నీట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని అన్నారు. పరీక్షలు నిర్వహిస్తే 240 చోట్ల కలుషిత నీరు కారణమని తేలిందని వివరించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. #satya-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి