Lokesh: నాడు నేడుపై విచారణ జరుపుతాం: మంత్రి లోకేష్ AP: అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో చేసిన నాడు-నేడు పనుల్లో మొత్తం అవినీతి జరిగిందని అన్నారు. నాడు-నేడు పై విచారణ జరుపుతాం అని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం అని చెప్పారు. By V.J Reddy 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Lokesh: రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు-నేడు అంటూ, గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచార ఆర్భాటమే అని అన్నారు. రెండు విడతల్లో చేసిన నాడు-నేడు పనులు మొత్తం అవినీతి, నాసిరకం అని పేర్కొన్నారు. రెండు విడతల్లో పనులు మొత్తం పెండింగ్ పెట్టారని ఆరోపించారు. మూడో విడత అసలు మొదలే కాలేదని అన్నారు. రూ.900 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లారని చెప్పారు. ALSO READ: అంతు చూస్తా.. లోకేష్‌పై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ ఖర్చు పెట్టిన దాంట్లో మొత్తం అవినీతి జరిగిందని, దాని పైనా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో 72 వేల మంది విద్యార్ధులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయారని అన్నారు. ఈ ఏడాది, విద్యా వ్యస్థ మొత్తం ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. కేజీ టు పీజీ మొత్తం ప్రక్షాళన చేయాలని... అందరి అభిప్రాయాలు తీసుకుని, వచ్చే ఏడాది అమలు అయ్యేలా చూస్తాం అని చెప్పారు. వేల కోట్లు ఖర్చు పెట్టాం, నాడు-నేడు అన్నారని... 2019 టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి, 38,98,000 మంది ప్రభుత్వ బడుల్లో చుదువుకుంటుంటే, నేడు 2024లో 38,26,000 మందికి ఆ సంఖ్య పడిపోయిందని అన్నారు. 72,000 మంది ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయారని అన్నారు. ఇంత ఖర్చు చేసి వీళ్ళు సాధించింది ఏంటి ? అంటే ఇందులో లోపాలు ఉన్నాయి, అవినీతి ఉందని... అన్నీ మేము సరి చేస్తామని స్పష్టం చేశారు. #lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి