/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/We-should-learn-governance-by-looking-at-CM-Jagan.jpg)
బానిసల్ని చేశావు
ప్రజాప్రతినిధి అయి ఉండి కార్యకర్తలను చెడు వ్యసనాలకు బానిసలను చేస్తూ తన వైపు తిప్పుకుంటున్నాడని దుయ్యబట్టారు. టీడీపీ నేతల వైఖరి గమనించే ప్రజలు వారికి సరైన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరల వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు దేవినేని అవినాష్.
ఏళ్లు ముఖ్యం కాదు.. పాలన ముఖ్యం
40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. సీఎం జగన్‌ను చూసి పాలన నేర్చుకోవాలన్నారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు తీసుకువెళ్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు అవినాష్. జగనన్న సురక్షలో 11 అంశాలపై సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా జగనన్న సురక్ష ఉందన్నారు.
బైబై చెప్పిన రోజులు..?
శుక్రవారం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పవన్ ది వారాహి కాదు.. నారాహి యాత్ర అని అన్నారు. జగన్‌ను గద్దె దించడానికి చంద్రబాబు, పవన్ తెగ తాపత్రయపడుతున్నారన్నారు. విలన్లు ఎంతమంది కలిసినా హీరో మాత్రం జగనే అని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక హీరో సీఎం జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు దేవినేని అవినాష్. బైబై జగన్ అన్న పవన్ గతంలో చంద్రబాబుకు, లోకేష్‌కు ప్రజానీకం బైబై చెప్పిన విషయం తెలియదాని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలకు ప్రజలు ఎప్పుడో బైబై చెప్పేశారన్నారు. మీరు గొంతెత్తి అరిచినా ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి దేవినేని అవినాష్ సూచించారు.
ఒక్క ఫోన్ చేస్తే చాలు...
జగన్‌పై అవాకులు చవాకులు పేలితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. గత టీడీపీ హయాంలో సమస్యలను పట్టించుకొనే వారు లేరు…మా హయాంలో సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. టీడీపి హయాంలో సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులలో బీరువాలు నిండిపోయేవి, వైసీపీ హయాంలో మాత్రం ఒక్క ఫోన్ కాల్‌తోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని దేవినేని అవినాష్ వెల్లడించారు.