Kerala : మా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయము.. కేరళ సీఎం సంచలన ప్రకటన

లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ నిర్ణయం మీద ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏ అమలు చేయమని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.

Kerala : మా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయము.. కేరళ సీఎం సంచలన ప్రకటన
New Update

We Don't Accept CAA : నిన్న రాత్రి నుంచి దేశంలో సీఏఏ చట్టాన్ని(CAA Act) అమలుల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం(Central Government). దీంతో దేశ వ్యాప్తంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) గురించే కీలక చర్చ జరుగుతోంది. సీఏఏ అమలును పలువురు స్వాగతిస్తూ ఉండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి దీని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత విభజన సృష్టించేలా ఉన్న ఈ సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ(Kerala) సీఎం పినరయి విజయన్‌(CM Pinaray Vijayan) తేల్చి చెప్పారు. దేశంలోని ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని అన్నారు. ఈ విషయాన్ని ఇంతకు ముందే చాలా సార్లు స్పష్టం చేశామని గుర్తు చేశారు. చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి తాము అదే మాట చెప్పామని.. ఇప్పుడు కేంద్రం అమలు ప్రకటించాక కూడా ఆ మాట మీదనే నిలబడుతున్నామని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు మొత్తం కూడా ఏకతాటి మీద నిలబడాలని ముఖ్యమంత్రి విజయన్ సూచించారు.

నిర్ణయాన్ని స్వాగతిస్తున్న బీజేపీ నేతలు..

మరోవైపు సీఏఏ చట్టం అమలు నిర్ణయాన్ని బీజేపీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల ముందు స్టంట్‌ అని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు యోగి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు దేశంలో సీఏఏ అమలు చరిత్రాత్మక నిర్ణయమని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. మోదీ గ్యారంటీ అంటే అర్థం ప్రతి హామీనీ ఖచ్చితంగా నెరేవేర్చడమేనని శివరాజ్ సింగ్ చౌహాన్‌ అన్నారు.

Also Read : Telangana : ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్‌ ఇవే..

#caa-act #pinaray-vijayan #kerala-cm
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe