ఆస్ట్రియా ప్రధానితో.. మోదీ భేటీ!

వాతావరణ మార్పులు, ఉగ్రవాదం సహా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆస్ట్రియా ప్రధానితో చర్చలు జరిపినట్టు మోదీ తెలిపారు. రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా చేరుకున్న మోదీకి అక్కడి ప్రభుత్వం సైనిక లాంఛనాలతో స్వాగతం పలికింది.అనంతరం ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు.

ఆస్ట్రియా ప్రధానితో.. మోదీ భేటీ!
New Update

రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం సైనిక లాంఛనాలతో రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికింది. అనంతరం ఇరుదేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యంపై చర్చలు జరిపారు. భేటీ అనంతరం ఇరువురు ప్రధానులు విలేకరుల సమావేశంలో చర్చలు గురించి వివరించారు.

నా హయాంలో ఆస్ట్రియాకు రావడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు.వాతావరణ మార్పులు, ఉగ్రవాదం సహా మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లపై ఆస్ట్రియా ఛాన్సలర్‌తో సంప్రదింపులు జరిపినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇది యుద్ధానికి సమయం కాదని వాతావరణ మార్పు  ఉగ్రవాదంతో సహా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను మేము చర్చించామని మోదీ అన్నారు. వాతావరణ మార్పుపై అంతర్జాతీయ సౌర సహకార కూటమితో కలిసి పనిచేయాలని  ఆస్ట్రియా ప్రధాని కు కోరినట్టు మోదీ వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి మోదీతో చర్చించామని ఆస్ట్రియా ప్రధాని కార్ల్ నెహ్మర్ చెప్పారు.రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనేందుకు భారత్ పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు.

#pm-modi #austria
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe