/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T092641.063.jpg)
భారత్ ప్రపంచ యోగా గురువుగా మారిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. రోజురోజుకు యోగా ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేక్ ఏ కశ్మీర్ కాన్ఫరెన్స హాల్ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ప్రధాని యోగా ఆసనాలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో దాదాపు 50 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ' శ్రీనగర్‌లో ఒక శక్తి ఉంది. యోగా ద్వారా దీన్ని మరింత పెంచుకోవచ్చు. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం వేడకులు జరుపుకుంటున్నాం.
Also Read: నేడు 60 బొగ్గు బ్లాకుల వేలం
అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి 2014లో తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించాను. భారత ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయి. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విదేశాల్లో కూడా యోగా చేసేవారి సంఖ్య పెరుగుతోంది. యోగా నేర్పించేందుకు వందల సంఖ్యలో సంస్థలు వచ్చాయి. జర్మనీలో దాదాపు కోటిన్నర మంది ప్రతిరోజూ యోగా చేస్తున్నారు. యోగా నేర్పే మహిళలకు పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది.
మనదేశంలో చాలా యూనిర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయి. యోగా ప్రాముఖ్యత గురించి చాలా దేశాల నేతలు నన్ను అడిగారు. యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి. ఈరోజు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరు తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని' ప్రధాని మోదీ అన్నారు.
Also Read: మరికాసేట్లో జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్..