MI vs GT: ఇషాన్ కిషన్ ఆటపై స్పందించిన పోలార్డ్!

ముంబయి,గుజరాత్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబై జట్టు ఓపెనర్ ఇషాన్ ఆట పై ఆ జట్టు కోచ్ పోలార్డ్ స్పందించాడు.

New Update
MI vs GT: ఇషాన్ కిషన్ ఆటపై స్పందించిన పోలార్డ్!

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్‌ చివరి ఓవర్‌లో  విజయానికి 19 పరుగులు అవసరం అయితే అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అద్భుతాలు చేయడంతో గుజరాత్ మ్యాచ్ గెలిచింది. ముంబైకి ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో  డకౌటయ్యాడు. 

మ్యాచ్ అనంతరం జరిగిన కాన్ఫరెన్స్‌లో కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ, “ఇషాన్ కిషన్‌పై వివాదం నాకు అర్థం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఆటగాళ్లందరికీ చాలా కష్టం. ఇది ప్రజలు అనుకున్నంత సులువు కాదు. ఈరోజు అతను స్కోర్ చేయలేదు. అయితే ఇది సుదీర్ఘ టోర్నీ. అతనికి చాలా అనుభవం ఉంది. అతడి నుంచి భారీ స్కోర్లు ఆశిస్తున్నాం. బాగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. రాబోయే రెండు మ్యాచ్‌ల్లో మీరు అతని నుండి పెద్ద ప్రదర్శనను చూడగలరని మేము ఆశిస్తున్నాము.

గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే విడుదలయ్యాడు. అప్పుడు BCCI  అతనికి విరామం ఇచ్చింది. దీని తర్వాత ఇషాన్ దుబాయ్‌లో ఓ పార్టీలో కనిపించాడు. రంజీ ట్రోఫీలో కచ్చితంగా ఆడితీరాలని బీసీసీఐ స్పష్టం చేసిన ఇషాన్ ఆడకపోవటం తో అతనిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది.

Advertisment
తాజా కథనాలు