Rahul dravid about middle order: టీమిండియాకు మిడిల్ ఆర్డర్ సమస్య చాలా కాలంగా ఉంది. టాపార్డర్ హిట్ అవ్వడం.. మిడిలార్డర్ నిలకడలేమి కారణంగా మనం గెలిచే మ్యాచ్ ఓడిపోవడం చాలా సార్లు జరిగింది. 2019 ప్రపంచ కప్‌లోనూ ఇదే జరిగింది.. సెమీస్ వరకు టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మ ఏకంగా ఆ టోర్నిలో ఐదు సెంచరీలు బాదాడు.. ప్రతి బ్యాటర్ ప్రతి మ్యాచ్‌లోనూ నిలపడాలని లేదు.. వరుస పెట్టి ఐదు మ్యాచ్‌లో అదరగొట్టిన ప్లేయర్ ఆరో మ్యాచ్‌లో తక్కువ పరుగులకే ఔట్ అవ్వొచ్చు.. అప్పుడు జట్టును ఆదుకోవాల్సింది మిగిలిన ఆటగాళ్లే కదా.. అప్పుడెప్పుడో యువరాజ్ సింగ్ టీమిండియాకు దూరమైన నాటి నుంచి ఖాళీగా ఉన్న నంబర్ 4,5 స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు లేకుండా పోయారు. శ్రేయర్ అయ్యర్ రాణించినా గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు.. వరల్డ్ కప్‌కి టైమ్ దగ్గర పడుతున్న వేళ ఈ పొజిషన్ టీమిండియాను కలవర పెడుతోంది.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడే చెప్పాం కదా?
ఆసియా కప్ రేపటి(ఆగస్టు 30) నుంచి ప్రారంభం అవుతుండగా.. టోర్నీకి ముందు మీడియాతో మాట్లాడారు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. మిడిలార్డర్ బ్యాటింగ్ కూర్పుపై రిపోర్టర్లు ప్రశ్నలు అడగగా.. "శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య ఉంటుంది.. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని బదులిచ్చారు. 18 నెలల క్రితం కూడా ఇదే విషయాన్ని చెప్పానని.. మిడిలార్డర్ ఈ ముగ్గురితోనే ఉంటుందన్నాడు. అయితే ఈ ముగ్గురూ గాయాలు బారిన పడ్డారని గుర్తు చేశారు ద్రవిడ్. రెండు నెలల వ్యవధిలో ముగ్గురికి గాయాలు కావడం దురదృష్టకరమన్నాడు ద్రవిడ్.
నిజమే కదా?
వాస్తవానికి మిడిలార్డర్ సమస్య టీమిండియాకు ఎప్పటి నుంచో ఉంది. మిడిలార్డర్‌లో అయ్యర్, రాహుల్, పంత్ చాలా కాలంగా ఆడుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో డెహ్రాడూన్-ఢిల్లీ హైవేపై జరిగిన ఘోర కారు ప్రమాదంలో పంత్‌కి యాక్సిడెంట్ అయ్యింది. అయ్యర్ , రాహుల్ వరుసగా మార్చి, మేలో గాయపడ్డారు. అయ్యర్‌కి వెన్ను గాయం అవ్వగా.. రాహుల్ తోడకు గాయమైంది. దీంతో అప్పటివరకు మిడిలార్డర్‌లో ఆడాల్సిన ముగ్గురు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. రాహుల్‌కి మరోసారి ఇంజ్యూరి అవ్వగా.. ఆసియా కప్‌లో టీమిండియా ఆడనున్న తొలి రెండు వన్డేలకు అతను అందుబాటులో ఉండడం లేదు. అటు అయ్యర్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో ఉన్నాడా లేదా అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుండగా..ఈలోపు ఈ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉంది.
ALSO READ: క్రికెట్ గాడ్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. ఇద్దరిలో ఎవరు ముందు బ్రేక్ చేస్తారు?