Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..రెండు రోజుల పాటు నీళ్లు బంద్‌!

హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు అధికారులు వివరించారు. జనవరి 20 ,21 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.

New Update
Hyderabad : హైదరాబాద్ వాసులకు అలెర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు షాక్‌ ల మీద షాక్‌ లు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న నగరంలో రోజూ రెండు గంటల పాటు విద్యుత్‌ కోతలు (power Cut) ఉంటాయని విద్యుత్‌ అధికారులు తెలిపితే...ఈరోజు రెండు రోజుల పాటు నగరంలో నీటి సరఫరా(Water Supply Bandh)  నిలిచిపోనుందని చావు కబురు మెల్లగా చెప్పారు.

మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు చేస్తున్న మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో 48 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుందని సమాచారం. నగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ (Drinking Water) సప్లయి ఫేజ్‌ 1లో అలియాబాద్ టేక్‌ ప్రాంతం వద్ద ఉన్న 1200 ఎంఎం గ్రావిటీ మెయిన్‌ పైపు లైన్‌ కు మరమ్మతు పనులు చేపడుతున్నారు.

చాంద్రాయణగుట్టలోని సన్నీ గార్డెన్‌ నుంచి షోయబ్‌ హోటల్ వరకు బాక్స్ డ్రైయిన్ పనులకు ఇబ్బందుల్లేకుండా పనులు మొదలు పెట్టినట్లు అధికారులు వివరించారు. దీంతో జనవరి 20 , 21 తారీఖుల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే నగరంలోని మిస్త్రీగంజ్‌, బహదూర్‌పూరా, కిషన్‌బాగ్‌, జహానుమా, మొఘల్‌పురా, దారుల్‌ షిఫా, సుల్తాన్‌ షాహి, అల్‌ జుబైల్‌ కాలనీ, అలియాబాద్‌, గౌలిపురా, తలాబ్‌ కట్ట, రియాసత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. ఒకే నెలలో రెండు సార్లు నీటి సరఫరా నిలిచిపోవడం గమనార్హం.

Also read: ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా..ఎందుకంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు