Hyderabad Metropolitan Water Supply : హైదరాబాద్ వాసులకు ఈనెల 3,4 తేదీల్లో తాగునీరు బంద్ కానున్నాయి. మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి(Hyderabad Water Supply) ఫేజ్-1లో సంతోష్‌నగర్ దగ్గరున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎస్ఆర్ డీపీ పనుల్లో భాగంగా నల్లగొండ, ఓవైసీ డౌన్ ర్యాంపు అలైన్ మెంట్ ఉన్న సంతోష్ నగర్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ జంక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఈనెల 3వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 4వ తేదీ గురువారం ఉదయం 6గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఈనెల 24గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మిరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, అస్మాన్ గఢ్, యాకుత్ పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్ , రియాసత్ నగర్, అలియాబాద్, బొగ్గుల కుంట, అప్జల్ గంజ్ , నారాయణగూడ, అడిక్ మెడ్, శివంరోడ్ , నల్లకుంట, చిలుకలగూడ, దిల్ సుఖ్ నగర్, బొంగుళూరు, మన్నెగూడ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని.. వినియోగదారులు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: కొత్త ఏడాది కానుక…తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు..!!