water leaks in house: ప్రస్తుత కాలంలో వాస్తుపైనే జీవితాలు, జీవన విధానాలు ముడిపడి ఉన్నాయి. ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, వాటికి ఎన్ని దర్వాజాలు ఉన్నాయి, కిటికీలు ఎన్ని అనేవన్నీ వాస్తు కిందకే వస్తాయి. వాస్తు బాగుంటే ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం, డబ్బు వస్తాయి. లేదంటే అనారోగ్యంపాలై వ్యాపారంలో నష్టాలు కూడా వస్తాయని జనాల నమ్మకం. అదే విధంగా బాత్‌రూమ్‌లో కూడా వాస్తు దోషాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బాత్‌రూమ్‌లో చిన్న వాస్తు దోషాలను సరిచేసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బాగుంటుందని అంటున్నారు. బాత్‌రూమ్‌ల విషయంలో పాటించాల్సిన సూచనలు ఏంటో తెలుసుకుందాం..
బకెట్‌లో ఎప్పుడూ నీళ్లు నిండుగా నింపి ఉంచాలి
బాత్‌రూమ్‌లో వాస్తు దోషం పోవాలంటే ఎప్పుడూ బ్లూ కలర్ బకెట్‌ను వాష్‌రూమ్‌లో ఉంచాలని అంటున్నారు. ఎందుకంటే నీలిరంగుకు వాస్తుశాస్త్రంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. బ్లూకలర్ బకెట్‌ను బాత్‌రూమ్‌లో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా విఫరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉండవని, డబ్బు వృధాగా ఖర్చు కాదనేది వాస్తు పండితుల వాదన. అంతేకాకుండా ఆ బకెట్‌లో ఎప్పుడూ నీళ్లు నిండుగా నింపి ఉంచాలట. దీంతో పాజిటివ్ శక్తి ఎక్కువ అవుతుంది. బాత్‌రూమ్ తలుపుకు ఎదురుగా లోపల మిర్రర్ ఉంచొద్దని, అలా ఉంచడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బాత్‌రూమ్‌లోకి వెళ్లి అద్దం నుంచి మళ్లీ ఇంట్లోకి వస్తుందని చెబుతున్నారు.
బాత్‌రూమ్‌లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి
అందుకే బాత్‌రూమ్‌లో అద్దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడూ బాత్‌రూమ్‌ను వాడిన తర్వాత వెంటనే తలుపు మూసివేయాలి లేకపోతే అందులోని నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది, దాంతో ఇంట్లోని వారు అనారోగ్యం బారిన పడతారు. బాత్‌రూమ్‌లోనే కాదు ఇంట్లో ఎక్కడ ట్యాప్‌లు ఉన్నా వాటి నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. లేకపోతే నీరు వృథాగా పోయినట్టే డబ్బు కూడా బాగా ఖర్చవుతుందని అంటున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తప్పవని అంటున్నారు. అంతేకాకుండా బాత్‌రూమ్‌లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే బాత్‌రూమ్, పంపుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బాగుంటారని నిపుణులు చెబుతున్నారు.