Watering Tree: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని నీళ్లు ఇచ్చే చెట్టు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు.. అనేక అద్భుతాలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని మనల్ని అబ్బుర పరుస్తాయి. ఏళ్ల తరబడి నిరంతరం నీరు ప్రవహిస్తున్న టర్మినలియా టొమెంటోసా చెట్టు సైన్స్‌కే సవాల్‌గా మారింది. By Vijaya Nimma 01 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Water Flows Out Of Mulberry Tree In Europe: సాధారణంగా మనం పువ్వులు ఉన్న చెట్టుని చూసి ఉంటాం. పండ్లు వచ్చే చెట్టును కూడా చూశాం. కానీ నీళ్లు వచ్చే చెట్టును ఎప్పుడైనా చూశారా. ఇది దక్షిణ ఐరోపాలో (Europe) ఉంది. దాదాపు 150 ఏళ్ల చెట్టు నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. చెట్టు కాండం నుంచి ఆకులు లేకుండానే పెద్ద ప్రవాహంలా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. భూమ్మీద జంతువులు, రకరకాల చెట్లు లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకోగలమా..? మానవ జాతి మనుగడ సాగించాలంటే ఇవన్నీ ముఖ్యమే. చెట్టు గురించి వింటే ఆశ్చర్యపోతారు ప్రతి దానికి మనం చెట్లపై ఆధారపడి బతుకుతున్నాం. నిత్యం ఇంటికి అవసరమైన కూరగాయలు, ఫర్నీచర్‌తో పాటు అనేక అంశాలకు చెట్లపై ఆధారపడుతూ ఉంటాం. మనుషులు, రకరకాల జీవరాసులు మనుగడ సాగించాలంటే ఆక్సిజన్ ఎంతో అవసరం. అలాంటి ఆక్సిజన్‌ను ఈ చెట్లు మనకు అందిస్తాయి. చెట్లు జీవక్రియలో భాగంగా వదిలే ఆక్సిజన్‌ను మనం పీలుస్తూ బతుకుతున్నాం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే చెట్టు గురించి వింటే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైనదిగా పేరుగాంచింది. ఇది కేవలం ఆక్సిజన్ మాత్రమే కాకుండా స్వచ్ఛమైన నీటిని కూడా మనకు అందిస్తోంది. నీళ్లు వచ్చే చెట్టుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఎండ తీవ్రత నుంచి రక్షించుకుంటాయి ఈ అద్భుతమైన చెట్టు పేరు టర్మినలియా టొమెంటోసా (Terminalia Tomentosa) అంటున్నారు. ఈ చెట్టును ఎక్కడ కట్ చేసినా కంటిన్యూగా నీళ్లు వస్తూనే ఉంటాయి. దాదాపు 30 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు తేమ, పొడి అడవుల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. టర్మినలియా చెట్టు కాండం మొత్తం నీళ్లే ఉంటాయి, అగ్నిప్రమాదాలు, ఎక్కువ ఎండ తీవ్రత నుంచి ఇవి తనకు తాను రక్షించుకుంటాయి. ఈ చెట్టును బౌద్ధమతస్థులు బోధి చెట్టు అంటారు. వైరల్‌గా మారిన ఈ చెట్టు మాంటెనెగ్రో రాజధాని పోడ్‌గోరికాలోని డైనోసా గ్రామంలో ఉంది. అసలు ఈ చెట్టు నుంచి ఇలా నిరంతరం ఇలా నీళ్లు రావడం వెనుక ఉన్న కారణాలేంటంటే.. ఆగ్నేయ ఐరోపాలోని మోంటెనెగ్రో ప్రాంతంలో కనిపించిన ఒక మల్బరీ చెట్టు (Mulberry Tree )దాని కాండంలోపల పంపుతో పోసినట్టు నీరు ప్రవహిస్తుంది. పోడ్గోరికా గ్రామంలో చాలా నీటి ప్రవాహాలు ఉంటాయి. ఈ ప్రవాహాలు ఒక స్ప్రింగ్ ద్వారా వస్తుంటాయి. వసంత రుతువులో, మంచు కరిగిపోయినప్పుడు లేదా చాలా చోట్ల భారీ వర్షపాతం కారణంగా పొంగిపొర్లుతుంటాయి. వసంతంలో కొంత భాగం ఈ మల్బరీ చెట్ల క్రింద ప్రవహిస్తుంది. అందుకే ఓవర్‌ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు చెట్టు దిగువ నుంచి నీరు చెట్టు యొక్క బోలులోకి పెరుగుతుందని, ఆ ఒత్తిడి వల్లే చెట్టు నుంచి నీరు వస్తుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: మీ పళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి #europe #tree-with-water-inside మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి