హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ సేఫేనా? హైదరాబాద్ లో ఫుడ్ సేప్టీ ఎలా ఉంది? అర్థరాత్రయినా సరే, స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుందని ఎక్కడబడితే అక్కడ తినటానికి ఎగబడుతున్నాం. అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. తెలంగాణలో ఆహార భద్రత, నాణ్యత ఘోరంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ప్రజలు తింటున్న ఆహారం నాణ్యమైనదా కాదా అని తేల్చే దిక్కు లేదు. టెస్టులు జరుపుతున్న సంఘటనలు తక్కువే . తెలంగాణలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని ప్రజల ఖర్మానికి వారిని వదిలేశారని విమర్శిస్తున్నారు. By M. Umakanth Rao 26 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి ప్రతీకాత్మక చిత్రం తెలంగాణలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర సంస్థల్లో ఆహార భద్రతా స్థాయులు దారుణంగా ఉన్నాయి. నాణ్యత పరీక్షలు సాగుతున్నా అవి తూతూ మంత్రంగా కనిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఇచ్చిన నివేదిక ఈ విషయాన్ని ప్రకటించింది. 2022-23 సంవత్సరానికి గాను ఈ సంస్ధ తెలంగాణకు ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో వంద సూచీల్లో ఇది 32 వ స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో తెలంగాణ 14 వ స్థానంలో ఉందని ఈ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. ఆహార నాణ్యతలో ఆరు ముఖ్యమైన సూత్రాలనూ పాటించడంలో విఫలమైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఫిర్యాదులిచ్చినా వినిపించుకునే నాధుడే లేడు 'కన్స్యూమర్ ఎంపవర్ మెంట్' కేటగిరీ కూడా ఇలాగే ఉంది. ఫుడ్ సేఫ్టీ విషయంలో అవగాహనా లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించటంలోనూ పరిస్థితి దయనీయంగా కొనసాగుతోంది. ఆహారం నాసిరకంగా ఉందనో. ఇతరత్రానో వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ సమస్యకు సత్వరం పరిష్కారం లభించడం లేదు. ఇక ల్యాబ్ లు తగినన్ని లేకపోవడమే గాక నిపుణుల కొరత కూడా పీడిస్తోంది. ఆహార శాంపిల్స్ సేకరించి దాన్ని సకాలంలో లేబొరేటరీలకు పంపే వ్యవస్థ కూడా సవ్యంగా లేదు.. ఈ విషయంలో తెలంగాణ 44 వ స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మానవ వనరులు, శిక్షణ, ఆహార నాణ్యతా ప్రమాణాల పెంపు వంటి ఇతర అంశాల్లోనూ వైఫల్యమే కనిపిస్తోంది. ఇవి వరుసగా 38, 25 శాతం ఉన్నట్టు లెక్క గట్టారు. హైదరాబాద్ లో పరిస్థితి ఘోరం ఇక్కడ ప్రజలు తింటున్న ఆహారం నాణ్యమైనదా కాదా అని తేల్చే దిక్కు లేదు. టెస్టులు జరుపుతున్న సంఘటనలు తక్కువే.. దీనివల్ల హైదరాబాద్ లో ఆహార సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీని పరీక్షించే నాథులే లేరని, ప్రభుత్వం రాత్రుళ్ళు కూడా పని చేసే ఈటరీలను ప్రోత్సహిస్తున్నా వీటిలో పని చేస్తున్నవారు చేతులకు గ్లోవ్స్, తలలకు హెడ్ కవర్స్ ధరిస్తున్నారా లేదా అని గానీ, నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారా అని పరిశీలించే వ్యవస్థ గానీ లేదని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో న్యూట్రిషియన్ గా పనిచేస్తున్న డా. అరుణాదేవి చెప్పారు. ప్యాకేజీ చేసిన ఫుడ్ ప్యాకెట్లలో హానికరమైన ఇంగ్రెడియంట్లు ఉన్నాయా అని తేల్చే ప్రక్రియ అసలు లేదని డా. కృష్ణమోహన్ అనే మరో నిపుణుడు విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సమస్యలతో బాధపడే రోగులకు నాణ్యత లేని ఆహారం ఇస్తే అది వారికి ప్రాణాంతకంగా మారుతుందని ఆయన చెప్పారు. కేరళ, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ప్రతీకాత్మక చిత్రం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఉన్నా ఉపయోగం లేదు హైదరాబాద్ లోను, మరో నాలుగు జిల్లాల్లోనూ " ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్" అనే వ్యవస్థ తెచ్చారు.. నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను లాంచ్ చేశారు. ఆహారంలో కల్తీ జరిగిందా, ఫుడ్ నాణ్యమైనదా కాదా అనే దాన్ని ఈ ల్యాబ్ లో టెస్ట్ చేసి నిర్ధారిస్తాయి. కానీ వీటి పని తీరు ఏమంత సంతృప్తికరంగా లేదు. ఇంప్రూవ్ మెంట్ కేటగిరి' లో పదికి రెండు మాత్రమే వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో , గతంలో సిబ్బంది కొరతను ఎదుర్కొనేవారమని, ప్రస్తుతం సిబ్బంది సంఖ్యను పెంచామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ విషయానికి వస్తే పర్ఫామెన్స్ బ్రేకప్ బలహీనంగానే ఉంది. హ్యూమన్ రిసోర్సెస్ లోను, ఫుడ్ టెస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లోను, ట్రెయినింగ్ కెపాసిటీ బిల్డింగ్, కన్స్యూమర్ ఎంపవర్ మెంట్, ఎస్ఎఫ్ఎస్ఐ ఇంప్రూవ్ మెంట్ వంటి అంశాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి