Watch Video: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టిన మిలిటరీ జెట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

క్షణకాలంలో దారుణం జరిగిపోయింది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆ వెళుతున్న ఆ కుటుంబంలో రెప్పపాటులో పెను విషాదం చోటు చేసుకుంది. మిలిటరీకి చెందిన ఫైటర్ జెట్ రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది.

Watch Video: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టిన మిలిటరీ జెట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
New Update

Military Jet Hits Car In Italy: క్షణకాలంలో దారుణం జరిగిపోయింది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆ వెళుతున్న ఆ కుటుంబంలో రెప్పపాటులో పెను విషాదం చోటు చేసుకుంది. మిలిటరీకి చెందిన ఫైటర్ జెట్ రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకోగా.. ఈ భయానక ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆకాశం నుంచి అదుపు తప్పిన ఫైటర్ జెట్‌.. నేరుగా కారును ఢీకొట్టింది. దాంతో కారు పేలిపోయింది. ఇక జెట్ ప్రమాద సమయంలో పైలట్ అలర్ట్ అయి బయటకు దూకేశాడు. దాంతో అతను సేఫ్‌ అయ్యాడు. కారులో ఉన్న ఐదేళ్ల చిన్నారితో పాటు.. మరో తొమ్మిదేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు, జెట్ పైలట్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

ఇటలీలోని టురిన్ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు గాల్లో చెక్కర్లు కొడుతున్న ఫైటర్ జెట్.. ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ప్రమాదం సమయంలో అలర్ట్ అయిన పైలట్.. పారాచూట్ సాయంతో బయటకు దూకేశాడు. దాంతో అతను సేఫ్ అయ్యాడు. ఇక జెట్ చాలా స్పీడ్‌గా రోడ్డు మీదకు దూసుకొచ్చింది. మొదట రోడ్డును ఢీకొట్టి పెలిపోయిన జెట్.. అలాగే వెళుతూ కారును ఢీకొట్టింది. దాంతో కారు కూడా ప్రమాదానికి గురైంది. కారులో తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తుండగా.. ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో జెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే, ఫైటర్ జైటె గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పక్షుల గుంపు ఢీకొట్టిందట. దాంతో పక్షి ఇంజిన్‌లోకి ప్రవేశించడం వలన జెట్ ఇంజిన్ ఫెయిల్ అయిందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు అధికారులు. ఈ ప్రమాదంపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. చిన్నారి మృతి పట్ల సంతాపం ప్రకటించింది.

Also Read:

Ganesh Chaturthi: వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో బ్రహ్మోత్సవ వేడుకలు.. సర్వాంగసుందరంగా ఆలయం ముస్తాబు..

Parliament Special Session: నేటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఏ అంశాలపై చర్చించనున్నారంటే..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe