Mamata viral Video: చీరతో, చెప్పులు ధరించి మమత బెనర్జీ పరుగులు.. పియానో వాయించిన దీదీ!

మమత బెనర్జీ చేయలేనిది ఏదైనా ఉందా? రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులను ఉరుకుల పరుగుల పెట్టే పశ్చమబెంగాల్‌ సీఎం దీదీ నిజజీవతంలో ఫిట్‌గా ఉండటానికి జాగింగ్ చేస్తారు. ప్రస్తుతం స్పెయిన్‌ పర్యటనలో ఉన్న మమత చీరతో, చెప్పులు ధరించి జాగింగ్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అటు దీదీ పియానో వాయిస్తున్న వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది

Mamata viral Video: చీరతో, చెప్పులు ధరించి మమత బెనర్జీ పరుగులు.. పియానో వాయించిన దీదీ!
New Update

Mamata Banerjee Goes For Morning Jog In Saree : 68 ఏళ్ల దీదీ జాగింగ్‌ చేస్తూ అదరగొట్టారు. చీరలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పరుగులు పెట్టారు. చాలా మంది జాగింగ్‌ చేయడానికి దానికి సంబంధించిన సూట్ ధరిస్తారు. దీదీ మాత్రం ఎప్పటిలాగే తన వస్త్రధారణతోనే జాగింగ్ చేశారు. మమతా బెనర్జీ(Mamata Banerjee) చీర, చెప్పులు ధరించి మార్నింగ్ జాగ్ కోసం వెళుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్ పర్యటనలో ఉన్న దీదీ జాగింగ్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మమత ప్రస్తుతం బెంగాల్‌కి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దుబాయ్, స్పెయిన్‌లకు వెళ్లారు. 12 రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో పర్యటన ప్రారంభమవగా.. ఇప్పటికే అనేక వ్యాపార సమావేశాలను నిర్వహించారు దీదీ.


షేర్ చేసిన క్లిప్‌లో.. బెనర్జీ తన టీమ్‌తో కలిసి పార్క్‌లో జాగింగ్ చేస్తున్నట్లు కనిపించారు. 'మార్నింగ్‌ రిఫ్రెష్. చక్కటి జాగ్ మీకు రాబోయే రోజు కోసం శక్తినిస్తుంది. ఫిట్‌గా ఉండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి!' అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

పియానో వాయించిన దీదీ:

మరొక వీడియోలో దీదీ మాడ్రిడ్‌లోని ఒక పార్కులో పియానో ​అకార్డియన్ వాయించారు. 'సంగీతం ఎప్పటికీ ఉంటుంది, సంగీతం మీతో ఎదగాలి, పరిణతి చెందాలి, మీ జీవితం ముగిసే వరకు మిమ్మల్ని అనుసరించాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.


నిన్న మాడ్రిడ్ చేరుకున్న దీదీ మూడు రోజుల పాటు వ్యాపార శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతున్నారు. బార్సిలోనాలో దీదీ బస చేయాల్సి ఉంది. ఆ తర్వాత దీదీ టీమ్‌ దుబాయ్‌కి తిరిగి వచ్చి మరికొన్ని వ్యాపార సమావేశాలను నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 23న కోల్‌కతాకు తిరిగి వస్తారు.

ALSO READ: కుటుంబాన్ని వదిలేసి వెళ్లిన మహిళ…పట్టించిన ఆధార్..!!

#mamata-banerjee #mamata-benerjee-jogging
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe