ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల పరికరాల్లో భద్రతా లోపాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరికలు జారీ చేసింది.iOS iPad: 17.6,16.7.9 లాంటీ వెర్షన్ ల భద్రతా లోపాలకారణంగా సైబర్ నేరగాళ్లు వినియోగదారుని సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని వారు పేర్కొన్నారు.
iOS iPad: 17.6,16.7.9 Mac OS(OS), 14.6 కంటే ముందు వెర్షన్‌లు 13.6.8 12.7.6 ,Safari: 17.6 కంటే ముందు వెర్షన్‌లలో సైబర్ దాడి చేసేవారు సమాచారాన్ని దొంగిలించవచ్చని, భద్రతా ఉల్లంఘనలకు కారణమవుతుందని సీఈఆర్‌టీ-ఇన్ హెచ్చరించింది. ఈ ప్రమాదాలను నివారించడానికి వినియోగదారులందరూ తమ Apple పరికరాల సాఫ్ట్‌వేర్‌ను నవీకరించాలని CERT-IN సలహా ఇస్తుంది.
ఐఫోన్‌లు స్పైవేర్‌కు గురికావచ్చని యాపిల్ భారత్‌తో సహా 150 దేశాల్లోని ప్రజలను హెచ్చరించింది. దీనిపై కేంద్ర సమాచార, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. CERT-IN నిరంతరం పర్యవేక్షిస్తోంది.