Jenasena: జనసేనలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. విజయవాడ కేంద్రంగా జనసైనికులు బాహాబాహికి దిగారు. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తమదే అంటే తమదే అంటూ నానా రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
గయాజుద్ధీన్ Vs పోతిన మహేష్..
అసలు విషయానికొస్తే..బెజవాడ పశ్చిమ టికెట్ మైనార్టీ కోటాలో తనకే సీటు ఇవ్వాలంటూ జనసెన అధికార ప్రతినిధి గయాజుద్ధీన్ భారీ ర్యాలీ నిర్వహించారు. సీటు ముస్లింలకు కేటాయించాలని గయాజుద్దీన్ అనుచరులు బలప్రదర్శన చేశారు. అయితే ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న పార్టీ పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్ కార్యలయం వద్దకు చేరకున్న గయాజుద్దీన్ అనుచరులు మహేష్ కార్యాలయం ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ మొదలవగా ఇరువర్గాలు బాహా బాహికి దిగాయి.
ఇది కూడా చదవండి: Telangana: వరంగల్ వెస్ట్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్
మా ఇష్టం అంటూ..
ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు అంటూ మహేష్ అనుచరులు ప్రశ్నించగా.. మా ఇష్టం అంటూ గయాజుద్దీన్ అనుచరులు సమాధానం దురుసుగా సమాధానం చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా మహేష్ వర్గం గజాజుద్దీన్ సన్నిహితులతో వాగ్వాదం పెట్టుకోగా ఎన్నికల ముందు ఈ అంశం జనసేనా అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
గయాజుద్దీన్ వర్గంపై కేసు..
ఇదిలావుంటే.. కొంత కాలంగా మహేష్ కు వ్యతిరేకంగా గ్రూప్ కట్టిన గయాజుద్దీన్ గతంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించాడు. తాను జనసేన సభ్యుడు కాదని గతంలో మహేష్ చేసిన ఆరోపణలు నిజమైతే.. రాజకీయాల నుండి తప్పుకుంటావా అంటూ గయాజుద్దీన్ సవాల్ చేశారు. ఏదిఏమైనా జనసైనికుల ఫైటింగ్ తో జనసేన పశ్చిమ రాజకీయం హట్ హాట్ గా మారింది. మహేష్ అనుచరులు గయాజుద్దీన్ వర్గంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.