Financial Decisions : కొత్త ఏడాది నుంచి డబ్బు, ఖర్చులు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!!

ఇంకొన్ని రోజుల్లోనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆర్థిక భద్రతను నిర్దారించడానికి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బడ్జెట్, ఎమర్జెన్సీ ఫండ్, లోన్ చెల్లింపులు, బీమా వీటన్నింటికి సిద్ధంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే ప్లాన్ చేసుకోవాలి.

Financial Decisions :  కొత్త ఏడాది నుంచి డబ్బు, ఖర్చులు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!!
New Update

కొత్త సంవత్సరం దగ్గరపడుతోంది. మనం కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మన ఆర్థిక అలవాట్ల (Financial Decisions)ను ఓసారి గమనించాలి. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. గతేడాది అనిశ్చితి ఇంకా సవాళ్లతో నిండి ఉంది. దీనితో 2024 కోసం ఆర్థికంగా సిద్ధమవ్వడం గురించి మనకు గుర్తు చేస్తుంది.

2024లో మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండేందుకు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాల గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ :
సమగ్ర బడ్జెట్(Comprehensive budget) ను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఖర్చుపై కన్నేసి ఉంచాలి. ఆదాయం, ప్రయాణాలు, కొనుగోలు అవసరాలు ఇంకా పొదుపు వంటి పలు వర్గాలకు డబ్బును కేటాయించండి. ఖర్చులను ట్రాక్ చేస్తే మీ బడ్జెట్ తో సరిపోలడం ద్వారా మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించకునే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం బడ్జెట్ యాప్స్ ను ఉపయోగించుకోవచ్చు.

అత్యవసరాలకు డబ్బు:
ఊహించని ఆర్థిక వైఫల్యాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు అత్యవసర నిధి (emergency fund) ఉండటం ముఖ్యం. కనీసం 3 నుంచి 6 నెలల వరకు జీవన ఖర్చులు ప్రత్యేకంగా పక్కనపెట్టుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర ఊహించని పరిస్థితుల్లో ఈ మొత్తం మీకు ఆసరాగా ఉంటుంది. విభిన్నమైన పోర్ట్ ఫోలియోను నిర్దారించుకునేందుకు స్టాక్స్, బాండ్లు ఇంకా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మంచిది.

లోన్స్ చెల్లింపులు:
క్రెడిట్ కార్డు బ్యాలెన్స్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటి ఎక్కువ వడ్డీ చెల్లించే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రుణాలపై వడ్డీ ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. దీనికోసం లోన్ పేమెంట్ (Loan Payment) ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

బీమా:
ఆర్థిక ప్రణాళికల్లో బీమా ఒకటి. మొదటిది, ఆరోగ్య బీమా (Health insurance)లో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక వైద్య ఖర్చుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంకా ఊహించన అనారోగ్యం లేదా ప్రమాదాలకు కవరేజీని కూడా అందిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఆరోగ్య బీమా పథకం ఉంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

#best-savings-plan #budget-saving-plans #financial-habits #financial-plans #money-saving-plans #new-year-plans #financial-security-plans
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe