ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను వండర్‌లాస్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. భారత్‌లో ఆపిల్ స్టోర్‌ల వెలుపల లేటెస్ట్ ఐఫోన్ పొందవచ్చు.

New Update
ఫ్లిప్‌కార్ట్‌లో  ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్!

128జీబీ మోడల్ ఐఫోన్ 15 ధర రూ. 79,900 కాగా, 256జీబీ, 512జీబీ వేరియంట్‌లు వరుసగా రూ. 89,900, రూ. 1,09,900గా ధర ట్యాగ్ అయ్యాయి. ఇప్పుడు, ఐఫోన్ 15పై దృష్టి సారించే వినియోగదారులకు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఈరోజు (జూన్ 19) ముగియనుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 తక్కువ ధరకు సొంతం చేసుకునేందుకు అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్‌ను 14 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర రూ.67,999కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో లేదాపాత స్మార్ట్‌ఫోన్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ట్రేడ్-ఇన్ వాల్యూతో మీ పాత ఫోన్ వర్కింగ్ కండిసన్‌పై ఆధారపడి ఉంటుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐ రహిత లావాదేవీలపై అదనంగా రూ. వెయ్యి ఆఫ్ బ్యాంక్ ఆఫర్ అందిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు