Walk Fast: వేగంగా నడిస్తే మధుమేహం తగ్గుతుందా?..పరిశోధనల్లో ఏం తేలింది..? టీవలి కాలంలో మారిన ఆహారపు అలవాట్లతో డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజూ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడవడం మంచిది. వేగంగా నడవడం వల్ల టైప్2 డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుందని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్టోర్ట్స్ మెడిసిన్‌లో పరిశోధకులలో తెలిపారు. By Vijaya Nimma 10 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Walk Fast: నడక అనేది మన అరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిదే. ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమయంలో వాకింగ్ చేస్తారు. అయితే ఈ వాకింగ్‌లో కొన్ని రకాలు కూడా ఉన్నాయి. ఈ నడక అనేది ఒక్కొక్కరికి హెల్త్ సమస్యలను బట్టి ఫలితాలు ఉంటాయి. అయితే.. ఈ మధ్య వేగంగా నడిస్తే ఎలాంటి ఫలితాలులు ఉన్నాయో టైప్ 2 డయాబెటిస్ రోగులపై పరిశోధన చేశారు. వేగంగా నడవడం వల్ల టైప్2 డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుందని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్టోర్ట్స్ మెడిసిన్‌లో పరిశోధకులలో ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతిరోజూ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ సమస్య నుంచి దూరం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యావత్ ప్రపంచంలో ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ఎదుర్కొంటున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన డయాబెటిస్ రోగులు ఎక్కువ అవుతున్నారని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జుట్టుకి మెహందీ పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి ప్రతీరోజూ నడక వేగం పెరిగే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం15 శాతం తక్కువగా అవుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. గంటకు కనీసం 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన పురుషులు నిమిషానికి 87 అడుగులు, మహిళలు నిమిషానికి 100 అడుగులు నడిస్తే డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అయితే పరిశోధనల ప్రకారం..2045 నాటికి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య 537 మిలియన్ల నుంచి 783 మిలియన్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వేగంగా నడవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఇరాన్‌లోని సెమ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కేవలం డయాబెటిస్ నివారించడమే కాకుండా, అనేక సామాజిక, మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #walking-briskly మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి